జాతీయ వార్తలు

పంజాబ్ విద్యార్థికి టాప్ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ ప్రొద్దుటూరు, జూన్ 23: వైద్య (ఎంబిబిఎస్), దంత వైద్య (బిడిఎస్) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాతీయ అర్హత/ ప్రవేశ పరీక్ష (నీట్)లో పంజాబ్ విద్యార్థి నవ్‌దీప్ సింగ్ టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. నీట్ ఫలితాల్లో ప్రొద్దుటూరుకు చెందిన మన్వితారెడ్డి 14వ ర్యాంక్ సాధించి తెలుగువారి సత్తా చాటింది. ప్రవేశ పరీక్ష ఫలితాలను సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షలో నవ్‌దీప్ సింగ్ మొత్తం 700 మార్కులకు గాను 697 మార్కులు సాధించి నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్‌కు చెందిన అర్చిత్ గుప్తా, మనీష్ ముల్చందానీ వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులను దక్కించుకున్నారు. మే 7వ తేదీన నిర్వహించిన నీట్‌కు మొత్తం 11,38,890 మంది విద్యార్థులు హాజరవగా, వీరిలో 6,11,539 మంది వైద్య ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,66,221 మంది బాలురు, 3,45,313 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షకు ఎనిమిది మంది ట్రాన్స్‌జెండర్లు (లింగ మార్పిడి చేయించుకున్నవారు) కూడా హాజరవగా, వారిలో ఐదుగురు అర్హత సాధించారు. నీట్-2017 ఫలితాలను ప్రచురించరాదని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వుపై మే 24వ తేదీన స్టే విధించిన సుప్రీం కోర్టు ఈ పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు ఈ నెల 12వ తేదీన సిబిఎస్‌ఇకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి రవళీశ్వర్‌రెడ్డి కుమార్తె మన్వితారెడ్డి 2017 నీట్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 14వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. రవళీశ్వర్‌రెడ్డి ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మన్వితారెడ్డి ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణలో 5వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్‌లో 13వ ర్యాంక్ సాధించింది. అలాగే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఏయిమ్స్)లో 18వ ర్యాంక్ సాధించింది. కార్డియాలజిస్టు కావాలన్నది తన లక్ష్యమని ఈ సందర్భంగా మన్వితారెడ్డి తెలిపింది. తమ కుమార్తె మొదటి నుంచి అన్ని తరగతుల్లో నుంచి ర్యాంకులు సాధిస్తూవచ్చిందని మన్వితా తల్లిదండ్రులు పేర్కొన్నారు. నీట్‌లో 14వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు.

చిత్రాలు.. నీట్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన నవదీప్.
*14వ ర్యాంకు సాధించిన మన్వితా రెడ్డి.