జాతీయ వార్తలు

రాళ్లతో కొట్టిచంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 23: జమ్మూ, కాశ్మీర్‌లో అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని కొట్టి చంపేశాయి. పోలీసుల కథనం ప్రకారం శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలో ఉన్న జామియా మసీదు సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన చోటు చేసుకొంది. మసీదు వద్ద డ్యూటీలో ఉన్న డిఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిట్ మసీదులోపలినుంచి బైటికి వస్తున్న జనం ఫోటోలను తీస్తూ ఉండగా, జనం ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో డిఎస్పీ ఆత్మరక్షణ కోసం తన పిస్టల్‌తో కాల్పులు జరపడంతో ముగ్గురు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన జనం ఆయనపై దాడి చేసి ఆయన దుస్తులను చించేసి నగ్నంగా చేసి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆయన మృతదేహాన్ని ఐడెంటిఫికేషన్ కోసం, చట్టపరమైన ఇతర ప్రక్రియల కోసం పోలీసు కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. కాగా, పోలీసు అధికారిని విధి నిర్వహణలో ఉండగా జనం కొట్టి చంపారని, ఇది చాలా దురదృష్టకరమైన
సంఘటన అని రాష్ట్ర డిజిపి ఎస్‌పి వైద్ అన్నారు. ఈ సంఘటన తర్వాత పాతనగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని పోలీసులు తెలిపారు. రెచ్చిపోయిన జనం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఖాళీ పోలీసు పికెట్లను ధ్వంసం చేశారు. రంజాన్‌లో భాగంగా రాష్ట్రంలో ముస్లింలు షబ్-ఎ-ఖాదర్‌ను పాటిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న రాత్రంతా మసీదులు, దర్గాల్లో ప్రార్థనలు జరిపారు. ముందుజాగ్రత్త చర్యగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు పోలీసు బలగాలను సంఘటన స్థలానికి తరలించడంతో పాటుగా నగరంలోని ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో జనం కదలికలపై ఆంక్షలు విధించారు. గురువారం పుల్వామా జిల్లాలో పోలీసు కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందడానికి నిరసనగా శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శనలకు వేర్పాటువాదులు పిలుపుఇచ్చిన దృష్ట్యా పోలీసులు ఈ ఆంక్షలను ప్రకటించారు.

చిత్రం.. డిఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిట్ శవపేటికను మోస్తున్న రాష్ట్ర డిజిపి ఎస్‌పి వైద్