జాతీయ వార్తలు

కరీంనగర్.. ఇక స్మార్ట్ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 23: దేశ వ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీ) జాబితాలో కరీంనగర్ నగరం చోటు దక్కించుకుంది. అలాగే పట్టణ సంస్కరణల్లో 86.92శాతం మార్కులతో తెలంగాణ రాష్ట్రం ఆరోస్థానంలో దక్కించుకుంది. ఢిల్లీలో శుక్రవారం నాడు అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ జాతీయ వర్క్‌షాప్ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు మూడో దశలో 30 స్మార్ట్ నగరాల జాబితాను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీల జాబితాలో 40 నగరాలకు అవకాశం ఉండగా 45 నగరాలు పోటీ పడ్డాయి.
కేంద్రమంత్రి వెంకయ్య ప్రకటించిన 30 నగరాలతో కలుపుకొని మొత్తం ఆకర్షణీయ నగరాల సంఖ్య 90కి చేరుకుంది. మూడో జాబితాలో 30 నగరాలను ప్రకటించగా అందులో తెలంగాణలోని కరీంనగర్ పట్టణం 6 స్థానంలో నిలించింది. అయితే మొదటి స్థానంలో కేరళ రాజధాని తిరువనంతవురం నిలవగా 30 స్థానంలో సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్ నిలిచింది. అదే విధంగా ఏపీ నూతన రాజధాని అమరావతి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఎంపికైన 30 నగరాల్లో స్మార్ట్ నగరాల ప్రణాళిక ప్రకారం రూ.57,393 కోట్ల పెట్టబడులను కేంద్రమంత్రి వెంకయ్య ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన కనీస వౌలిక సాదుపాయాల కల్పనకు రూ.4,879 కోట్లు, సాంకేతికతకు రూ 10,514 కోట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ నగరాల జాబితాలో 90 నగరాల్లో పెట్టబడులకు అనుమతించిన మొత్త రూ 1,91,155 కోట్లకు చేరుకుంది. 2016-17 ఏడాదికి పట్టణ సంస్కరణలు ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా రూ.500 కోట్లు పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. పట్టణ సంస్కరణల్లో 96.06 శాతం మార్కులతో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్టు వెంకయ్యనాయుడు ప్రటించారు. అలాగే తెలంగాణ 86.92 శాతం మార్కులతో ఆరోస్థానంలో నిలిచింది. ఏపీ అనంతరం ఒడిశా,జార్ఖండ్,చత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే దేశంలో 116 ప్రధానమైన పట్టణాల్లో ప్రజల జీవన నాణ్యతను నిర్ధారించనున్నామని వెంకయ్య వెల్లడించారు. దీనికి సంబంధించి సిటి లివబిలిటి ఇండెక్స్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఆయా నగరాల్లో ప్రజలు ఆరోగ్యవంతంగా,అనందంగా ఉంటున్నారో నిర్థారించే ర్యాంకులు ప్రటించనున్నట్టు తెలిపారు.
వెంకయ్యకు తెలంగాణ ఎంపీల కృతజ్ఞతలు
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీల జాబితా చేర్చడంపై ఎంపీ వినోద్ నేతృత్వంలోని కరీంనగర్ నేతల బృందం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వారసత్వ నగరం, అమృత పట్టణం, ఆకర్షణీయ పట్టణ జాబితాలో ఇప్పటికే వరంగల్ నిలించిందని తెలిపారు.
ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చడంలో ప్రజాప్రతినిధులు సఫలమైనట్టు చెప్పారు. ఈ నగరం స్మార్ట్ సిటీల్లో చేర్చేందుకు డిపిఆర్ అందించే క్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చాలా సూచనలు చేశారని చెప్పారు.