జాతీయ వార్తలు

యుపినుంచి కోవింద్ ప్రచారం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 24: రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల మద్దతు కోరేందుకు ఆదివారం ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. రాష్టప్రతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థి అయిన మీరాకుమార్ కూడా త్వరలోనే లక్నో సందర్శిస్తారని, ఈ ఎన్నికకోసం ఏ అవకాశాన్నీ వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఆమె పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులందరినీ కలుస్తారని ఆ నాయకుడు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఎమ్మెల్యే ఓటుకు అత్యధిక విలువ ఉన్న విషయం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికల్లోని ఎలక్టోరల్ కాలేజిలో లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికయిన ప్రజాప్రతినిధులుంటారు. ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం రాష్ట్రానికి వస్తారని, మర్నాడు ఉత్తరాఖండ్ వెళ్తారని బిజెపి జాతీయ కార్యదర్శి భూపేంద్ర యాదవ్ చెప్పారు. బిజెపి, దాని మిత్రపక్షాలకు చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఇతర పార్టీలకు చెందిన నేతలను కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాష్టప్రతి ఎన్నిక ఓటింగ్‌కోసం రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా సన్నాహాలను ప్రారంభించింది. శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందంతో సమావేశమైంది. రాష్టప్రతి ఎన్నికకు ముందే ఏర్పాట్లు పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, మొట్టమొదటిసారి ఓటర్లు తమ ప్రాధాన్యతా అభ్యర్థిని గుర్తించడానికి ఢిల్లీనుంచి లక్నోకు ఒక ప్రత్యేక పెన్, సిరాను తెప్పిస్తున్నారు.