జాతీయ వార్తలు

మెజారిటీ పెంచుకునేందుకు ఎత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: ప్రతిపక్షం ఓట్లు చీల్చటంద్వారా ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు బిజెపి ఎత్తు వేస్తోంది. ప్రతిపక్షంలోని సమాజ్‌వాదీ, బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన ఎంపీల మద్దతు సంపాదించేందుకు బిజెపి తెరవెనక రాజకీయం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు దాదాపు అరవై శాతం ఓట్లు ఉంటే ప్రతిపక్షం అభ్యర్థి మీరాకుమార్‌కు నలభై శాతం ఓట్లు పడతాయి. రామ్‌నాథ్‌కు ఎన్‌డిఏ మిత్రపక్షాలైన బిజెపి, శివసేన, తెలుగుదేశం పార్టీ, అకాలీదళ్, ఆర్‌ఎల్‌ఎస్‌పి, ఏడి, జిఎఫ్‌పి, ఎంజిపి, ఏఐఎన్‌ఆర్‌సి, జెకెపిడిపి, ఎన్‌పిఎఫ్, ఎన్‌పిపి, పిఎంకె, ఎస్‌డిఎఫ్, ఎస్‌డబ్లుపి పార్టీలకు చెందిన ఐదు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్లు పడతాయి. ఈ ఓట్ల విలువ 48.10 శాతం. దీనికి అన్నా డిఎంకెలోని రెండు వర్గాలు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలోని జెడి(యు), తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నాయకత్వంలోని టిఆర్‌ఎస్, ఐఎన్‌ఎల్‌డి, కొందరు స్వతంత్ర అభ్యర్థుల ఒక లక్ష ముప్పై మూడువేల తొమ్మిది వందల ఏడు ఓట్లు అదనంగా పడుతున్నాయి. ఎన్‌డిఏకు ఉన్న 48.10 శాతం ఓట్లు, అదనంగా పడుతున్న 12.20 శాతం ఓట్లు కలిపితే రామ్‌నాథ్ కోవింద్‌కు మొత్తం ఆరు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు అంటే 60.30 శాతం ఓట్లు పడనున్నాయి. ప్రతిపక్షం రాష్టప్రతి అభ్యర్థి మీరాకుమార్‌కు యుపిఏ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఐయుఎంఎల్, ఆర్‌ఎస్‌పి, కేరళ కాంగ్రెస్ (మణివర్గం) డిఎంకె ఓట్లు ఒక లక్షా డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లతోపాటు ప్రతిపక్షానికి చెందిన సిపిఎం, సిపిఐ, ఏఐటిసి, ఎన్‌సిపి, ఎస్‌పి, బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ, ఆర్‌జెడి, ఏఐయుడిఎఫ్, ఐఎన్‌ఎల్‌డి, జెఎంఎం, ఎంఐఎం, జెడిఎన్‌సి ఓట్లు రెండు లక్షల అరవై వేల మూడు వందల తొంభై రెండు ఓట్లు కలిపితే మొత్తం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క ఓట్లు (39.70 శాతం ) ఓట్లు పోలవుతాయి.
రామ్‌నాథ్ కోవింద్‌కు అరవై శాతం కంటే ఎక్కువ ఓట్లు పడేలా చేసేందుకు బిజెపి అధినాయకత్వం సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ, బిఎస్‌పి ఓట్లుపై దృష్టి కేంద్రీకరించిందని అంటున్నారు. బిజెపి అధినాయకత్వం రాష్టప్రతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ పేరు ప్రకటించినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ బహిరంగంగా మద్దతు ప్రకటించటం తెలిసిందే. మీరాకుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన 17 ప్రతిపక్షాల సమావేశానికి ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ హాజరు కాకుండా రాజ్యసభలో తమ పార్టీ పక్షం నాయకుడు రాంగోపాల్ యాదవ్‌ను పంపించటం విదితమే. బిఎస్‌పి అధినాయకులు మాయావతి కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవటం గమనార్హం.
దళిత వర్గానికి చెందిన కోవింద్‌కు తమ మద్దతు ఉంటుందనే విధంగా మాయావతి మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పట్ల ఆ పార్టీ శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి అధినాయకత్వం తెరవెనక ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. రాష్టప్రతి ఎన్నికలో తాము సూచించేవారికే ఓటు వేయాలని విప్ జారీ చేసేందుకు పార్టీలకు అధికారం లేదు. అందుకే పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసేందుకు వీలుంటుంది. ప్రతిపక్షం నుండి కనీసం పది శాతం ఓట్లు రామ్‌నాథ్ కోవింద్‌కు పడేలా చూసేందుకు బిజెపి పావులు కదుపుతోందని అంటున్నారు.