జాతీయ వార్తలు

అదే అవస్థ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయమై నిర్ణయం తీసుకోవడంలో అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి) మరోసారి విఫలమైంది. అయితే అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు అణు సరఫరాల గ్రూపులో సభ్యత్వం కల్పించాలా? లేదా? అనే విషయంపై నవంబర్‌లో మరోసారి చర్చించాలని ఎన్‌ఎస్‌జి నిర్ణయించింది. ఎన్‌పిటిపై సంతకం చేయని భారత్‌ను ఎన్‌ఎస్‌జిలో చేర్చుకోరాదని ఈ కూటమిలో కీలక సభ్య దేశమైన చైనా ఆదినుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏకాభిప్రాయ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వాన్ని పొందడంలో భారత్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలు తమ కూటమిలో సభ్యత్వం కోసం చేసుకున్న దరఖాస్తుల్లోని సాంకేతిక, న్యాయ, రాజకీయ అంశాలపై తాజాగా జరిగిన ప్లీనరీ సమావేశంలో చర్చించామని ఎన్‌ఎస్‌జి పేర్కొంది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ ప్లీనరీ సమావేశం శుక్రవారం ముగిసింది. పౌర అణు సహకారానికి సంబంధించి 2008లో ఎన్‌ఎస్‌జి చేసిన ప్రకటనలోని అన్ని అంశాలను అమలు చేసే విషయంతో పాటు భారత్‌తో ఎన్‌ఎస్‌జికి గల సంబంధంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ప్లీనరీలో జరిపిన
చర్చలను కొనసాగించేందుకు నవంబర్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు ఎన్‌ఎస్‌జి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎన్‌పిటిపై సంతకం చేయలేదన్న కారణంతో భారత్‌ను అణు సరఫరాల గ్రూపులో చేర్చుకోరాదని చైనా వాదిస్తున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌జి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం కల్పించరాదన్న తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చైనా గత వారం స్పష్టం చేసింది. దీంతో ఈ అంశం భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాన ప్రతిబంధకంగా మారింది. అణు సరఫరాల గ్రూపులో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేసుకున్న తర్వాత చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ కూడా ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.