జాతీయ వార్తలు

జూలై 17 నుంచి వర్షాకాల పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 17న ప్రారంభమై ఆగస్టు 11 వరకూ కొనసాగుతాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. తొలి రోజున రాష్టప్రతి ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది. రామ్‌నాథ్ కోవింద్ ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు ఎంపిలంతా రాష్టప్రతి ఓటింగ్‌లోనే పాల్గొంటారు. లోక్‌సభలో సిట్టింగ్ ఎంపి వినోద్‌ఖన్నా, రాజ్యసభ సభ్యురాలు పల్లవి రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిల మృతికి పార్లమెంట్ సంతాపం తెలిపి వాయిదా పడుతుంది. 18 నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు జరుగుతాయి.