జాతీయ వార్తలు

మంత్రిపై అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: మధ్యప్రదేశ్ సీనియర్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల్లో అయిన ఖర్చుకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవడంతో మిశ్రాపై మూడేళ్లపాటు అనర్హత వేటు పడింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మిశ్రా ఎన్నికల ఖర్చులు అఫిడవిట్ రూపంలో వెల్లడించాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి కచ్చితంగా ఇది పాటించాల్సిందే. అయితే దతియా నియోజకవర్గం నుంచి పోటీచేసిన మిశ్రా ఈ నిబంధనలు ఉల్లంఘించారు. 2008 ఎన్నిక సందర్భంగా అఫిడివిట్‌లో ఖర్చుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతి ఇసికి ఫిర్యాదు చేశారు. పైగా నరోత్తమ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. మంత్రిపై మూడేళ్లపాటు అనర్హత వేటు వేసినట్టు ఇసి సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. కాగా ఎన్నికల ఖర్చు వివరాల కేసుకు సంబంధించి 2013 జనవరి 15న నరోత్తమ్ మిశ్రాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు అలాగే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ మిశ్రాకు ఉపశమనం లభించలేదు. శనివారం కేసును విచారించిన ఎన్నికల కమిషన్ తీర్పును వెలువరించింది. మరోపక్క మిశ్రా రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. నరోత్తమ్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మిశ్రా కేబినెట్ నుంచి తక్షణం తప్పుకోవాలి’ అని ప్రతిపక్ష నేత అజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. బిజెపి అభ్యర్థులు ఎన్నికల్లో ఎలా గెలిచారో చెప్పడానికి మిశ్రా ఉదంతమే ఉదాహరణ అని ఆయన అన్నారు. మిశ్రా నీటి వనరులు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. పెయిడ్ న్యూస్‌కు ఖర్చుచేసిన సొమ్ములకు లెక్కచెప్పకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసిందని పిసిసి అధ్యక్షుడు యాదవ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఇసి నిర్ణయం చెంపపెట్టు అని ఏఐసిసి లీగల్ సెల్ చైర్మన్, సీనియర్ అడ్వొకేట్ వివేక్ టంఖా వ్యాఖ్యానించారు. నరోత్తమ్ తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని మధ్యప్రదేశ్ ఆప్ శాఖ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ తీర్పును అధ్యయనం చేసిన తరువాత ఏం చేయాలో ఆలోచిస్తామని బిజెపి అధికార ప్రతినిధి దీపక్ విజయ్ వర్గియా చెప్పారు.

చిత్రం.. నరోత్తమ్ మిశ్రా