జాతీయ వార్తలు

నేపాల్, భూటాన్‌లలో పర్యటనకు ఆధార్ గుర్తింపు చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: నేపాల్, భూటాన్‌లలో పర్యటించే భారతీయులకు ఆధార్ కార్డు ప్రామాణికంగా గుర్తించడం లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేపాల్, భూటాన్‌లలో పర్యటించేందుకు భారతీయులకు వీసా అవసరం లేదని అయితే వ్యక్తిగత గుర్తింపునకు ఓటరు కార్డు లేదా పాస్‌పోర్టును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. అదే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు గాని 15 సంవత్సరాల లోపు పిల్లలు గాని గవర్నమెంటు హెల్త్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, పాన్ కార్డులలో ఏదైనా ఒకటి గుర్తింపుగా కలిగి ఉండాలని కానీ దీనికి ఆధార్ కార్డు మాత్రం చెల్లదని స్పష్టం చేసింది. మనదేశ సరిహద్దులో ఉన్న నేపాల్, భూటాన్‌లకు రోడ్డు మార్గంలో వెళ్లే భారతీయులకు వీసా అవసరం లేదు కేవలం వ్యక్తిగత గుర్తింపు కార్డులుంటే సరిపోతుంది. అయితే వీటిలో ఆధార్‌కు మాత్రం చోటులేదు. నేపాల్, భూటాన్‌లకు భారత్ నుంచి నిత్యం వేలాదిమంది రోడ్డు మార్గంలో వెళ్లి వస్తుంటారు.