జాతీయ వార్తలు

ఇద్దరు మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 25: శ్రీనగర్ శివార్లలో శనివారం సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి శ్రీనగర్- జమ్మూ, నేషనల్ హైవేపై ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలులో దాగిన ఇద్దరు మిలిటెంట్లను భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం మట్టుపెట్టడంతో 14 గంటలుగా సాగుతున్న ఎన్‌కౌంటర్‌కు తెరపడింది. నగర శివార్లలో పంథాచౌక్ వద్ద సిఆర్‌పిఎఫ్ బృందంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక అధికారి మృతి చెందగా మరో కానిస్టేబుల్ గాయపడ్డం తెలిసిందే. ఈ దాడి తర్వాత మిలిటెంట్లు పారిపోయి అక్కడికి దగ్గర్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోకి చొరబడ్డారు. శ్రీనగర్‌లోని ఆర్మీ కోర్ ప్రధాన కార్యాలయానికి కిలోమీటర్ దూరంలోనే ఈ స్కూలుఉంది. వెంటనే భద్రతా దళాలు ఏడు భవనాలు, 36 గదులున్న ఆ స్కూలు భవనాన్ని చుట్టుముట్టి నిన్న రాత్రే అక్కడున్న సిబ్బందినందరినీ ఖాళీ చేయించారు. స్కూలు భవనంలో దాగి ఉన్న మిలిటెంట్లను బైటికి రప్పించడం కోసం ఆదివారం తెల్లవవారుజామునుంచి భద్రతా దలాలు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య కాల్పులు మొదలైనట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఎన్‌కౌంటర్ ముగిసిందని, ఇద్దరు మిలిటెంట్లు హతమైనారని ఆదివారం సాయంత్రం ఓ అధికారి చెప్పారు. అయితే భవనంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆ అధికారి తెలిపారు. ఇరుపక్షాల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారని వారిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన చోట నిరసన ప్రదర్శనలు జరగకుండా చూడడం కోసం ముందుజాగ్రత్త చర్యగా జాతీయ రహదారిపై రామ్ మున్షీబాద్‌నుంచి సేంపోరా వరకు నిషేధాజ్ఞలు విధించడంతో పాటుగా మొబైల్ నెట్‌వర్క్‌లను సైతం నిలిపివేశారు.

చిత్రం.. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పహరా కాస్తున్న భద్రతా సిబ్బంది