జాతీయ వార్తలు

కేబుల్ కారు కూలి ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 25: కాశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్‌లో కేబుల్ కారు కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన జయంత్ అంద్రాస్కర్, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా, మిగతా ముగ్గురు టూరిస్టు గైడ్‌లుగా పని చేసే స్థానికులని అధికారులు చెప్పారు. పెనుగాలుల తాకిడికి విరిగి పడిన ఓ చెట్టు గుల్మార్గ్ గోండోలా రోప్‌వే కేబుల్ లైన్లపై పడ్డంతో వైర్లు తెగిపోయి కేబుల్ కారు కూలిపోయిందని అధికారులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా రోప్‌వేను ఉపయోగించుకున్న సుమారు వందమంది చిక్కుపడి పోయారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ఈ రోప్‌వేను నిర్వహించే జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర కేబుల్ కార్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాలి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కేబుల్ కారు సేవలను ఎందుకు నిలిపివేయలేదని ప్రశ్నించారు.

చిత్రం.. కేబుల్ కార్ కూలిపోవడానికి కారణమైన చెట్టు