జాతీయ వార్తలు

రామగుండం ఎరువుల కర్మాగారం ఇక దేశంలోనే అతిపెద్దది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: తెలంగాణలోని రామగుండం ఎరువుల కార్మాగారం నుంచి 2018 చివరికల్లా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ సిఇవో వివేక్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ఎరువుల కార్మాగారానికి తెలంగాణ తన వాటా కింద రూ.72.21 కోట్లు విడుదల చేసింది. దీంతో వివేక్ మల్హోత్రాతో పాటు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాల్హోత్రా విలేఖరులతో మాట్లాడుతూ, ఈ ఎరువుల కర్మాగారం దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనున్నదని, దీని ద్వారా సంవత్సరానికి 1.2 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరగుతుందని చెప్పారు. ఎంపీ సుమన్ మాట్లాడుతూ, ఏన్నో సంవత్సరాలుగా మూతబడిన ఈ ఎరువుల ఫ్యాక్టరీ కెసిఆర్ ప్రోత్సాహంతోనే పునరుద్ధరణకు నోచుకుందన్నారు.
కర్మాగారం పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద దశల వారీగా రూ.144.43 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఎరువుల కర్మాగారం 2018 డిసెంబరు నాటికల్లా జాతికి అంకితం కానుందని చెప్పారు. ఈ కర్మాగారం వల్ల పెద్దపల్లి ప్రాంతంలో ఉపాధి అవకాశలు పెరగడంతోపాటు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
రామగుండం ప్రాంతంలో ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో మరో ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక ప్రైవేటు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే పలుమార్లు రామగుండం ప్రాంతంలో పర్యటించారని సుమన్ తెలిపారు.