జాతీయ వార్తలు

నక్సల్స్ ప్లీనరీపై జవాన్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 25: దండకారణ్యం మళ్లీ నెత్తురోడింది. రెండు రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గుట్టల్లో శనివారం మావోయిస్టుల ప్లీనరీని భగ్నం చేసేందుకు భద్రతా బలగాలు యత్నించాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు. రెండు వర్గాల మధ్య దాదాపు 60 గంటల పాటు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సుకుమా జిల్లా డొడీ తూమ్‌నార్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లు ఐజీ అవస్థీ తెలిపారు. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ నేతృత్వంలో ప్లీనరీ జరుగుతున్నట్లు బలగాలకు సమాచారం అందింది. ఈ నెల 22న మొదలై 25 వరకు ప్లీనరీ జరుగుతుందన్న సమాచారంతో సుమారు 500 మందితో భద్రతా బలగాలు గుట్టల్లోకి చేరుకున్నాయి. బలగాల రాకను గమనించిన మావోలు కాల్పులకు తెగబడటంతో సుక్మా జిల్లా ఎర్రబోరుకు చెందిన కానిస్టేబుల్ కట్టం రాజ్‌కుమార్, బోడేగూడకు చెందిన అసిస్టెంట్ పోలీసు కానిస్టేబుల్ సున్నం మనీష్, టెట్రాయ్‌కి చెందిన మడకం చంద్ర అనే అసిస్టెంట్ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. హోరాహోరీ కాల్పుల్లో పోలీసులు 12మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు పరారయ్యారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్లీనరీ జరుగుతున్న ప్రదేశంలో ఆయుధాలతో పాటు ఐదు గ్రెనేడ్లు, విప్లవ సాహిత్యం, రేడియోతో పాటు ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా సంఘటనా స్థలంలో మావోయిస్టు సెక్షన్ కమాండర్ కొర్సా మహేష్ మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. మిగతా మావోలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుంటే, బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలపై మావోలు పంజా విసిరారు. టర్రెం పోలీసు స్టేషన్ పరిధిలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలపై అత్యంత శక్తిమంతమైన ఐఈడీ పేలుడు పదార్థాలతో దాడి చేయడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిత్రం.. పోలీసులు స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లు, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు