జాతీయ వార్తలు

మరో చారిత్రక అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మరో చారిత్రక అడుగు ముందుకు వేస్తోంది. 150 సంవత్సరాల సంప్రదాయానికి చరమగీతం పాడుతూ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1నుంచి కాకుండా జనవరి ఒకటినే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు అనుగుణంగా సాధారణ బడ్జెట్‌ను నవంబర్‌లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా ప్రణాళిక చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ వాళ్ల కాలం నాటి విధానాలనే 70 ఏళ్లుగా అనుసరిస్తున్న దేశంలో మార్పు తీసుకురావటానికి చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటే ఆర్థిక క్యాలెండర్‌ను పూర్తిగా మార్చేందుకు కేంద్రం అన్ని కసరత్తులూ చేస్తోంది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు డిసెంబర్‌కంటే ముందే ప్రారంభమవుతాయి. అంటే నవంబర్ మొదటి వారంలోనే ఈ సమావేశాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. డిసెంబర్ 31లోగా బడ్జెట్ ఆమోదానికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తవుతాయి.
1867లో బ్రిటిష్ ప్రభుత్వం భారత ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటిదాకా మన దేశంలో ఆర్థిక సంవత్సరం మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండేది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక సంవత్సరాన్ని సాధారణ క్యాలెండర్‌తో సమన్వయం చేయాలని భావించారు. ప్రధాని ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ మొన్నటి డిసెంబర్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తన నివేదికను సమర్పించింది. దీంతో పాటు నీతి ఆయోగ్ ప్రభుత్వానికి ఇచ్చిన నోట్‌లో కూడా జనవరి 1నుంచి ఆర్థిక సంవత్సరం పాటించడాన్ని సమర్థించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం భారత దేశ సంస్కృతిని, సంప్రదాయాలను పరిగణలోకి తీసుకోలేదని, ప్రజాప్రతినిధుల అనుకూలతలను సైతం పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయించిందని నీతి ఆయోగ్ తన నోట్‌లో పేర్కొంది.