జాతీయ వార్తలు

ఉద్రిక్తతల మధ్య కాశ్మీర్‌లో ఈద్ ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 26: జమ్మూకాశ్మీర్ అంతటా సోమవారం రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మసీదులు, ఈద్గాల్లో జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే కాశ్మీర్ లోయలో రాళ్లదాడులు సంఘటనలు జరిగాయ. పలుచోట్ల భద్రతా దళాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. ఈద్గాలో ప్రార్థనలు ముగించుకుని బయటకువచ్చిన యువకులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. కాగా శ్రీనగర్‌లో అతిపెద్దదైన హజ్రత్‌బాల్ దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో 50 వేలమంది పాల్గొన్నారు. నగర నడిబొడ్డున ఉన్న సోనావార్, సౌరా మసీదుల్లోనూ వేలాది మంది ప్రార్థనలు చేశారు. లోయలోని ప్రధాన దర్గాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సోపోర్, అనంతనాగ్, రాజ్‌పొర, షోపియాన్ పట్టణాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఘర్షణల్లో ఎవరైనా గాయపడిందీ, లేనిదీ వివరాలు తెలియరాలేదు. వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్‌లను ముందస్తుగా గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ మహ్మద్ యాసిన్‌ను ముందుజాగ్రత్తగా కస్టడీలోకి తీసుకుని శ్రీనగర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు.

చిత్రం.. శ్రీనగర్‌లో రంజాన్ ప్రార్థనల అనంతరం భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతున్న అల్లరిమూక