జాతీయ వార్తలు

మహిళా జైలులో అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: ఖైదీ మరణాన్ని నిరసిస్తూ ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టి అల్లర్లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ముంబయిలోని మహిళా జైలులోని దాదాపు 200 మంది ఖైదీలపై కేసులు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా కూడా ఈ కేసులు నమోదైన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి మంజు గోవింద్ షెట్టి (45) అనే ఖైదీ మరణించడంతో ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బైకుల్లా జైలులో మహిళా అధికారి తీవ్రంగా కొట్టడం వల్లనే మంజు గోవింద్ షెట్టి మృతి చెందిందని ఆరోపిస్తూ తోటి ఖైదీలు శనివారం ఈ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన సందర్భంగా కొంత మంది ఖైదీలు జైలు పైకప్పు పైకి ఎక్కగా, మరికొంత మంది వార్తాపత్రికలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. మహిళా జైలులో అధికారి తీవ్రంగా కొట్టిన దెబ్బలకు తాళలేకనే మంజు గోవింద్ షెట్టి మృతిచెందిదని తోటి ఖైదీలు ఆరోపించారు.