జాతీయ వార్తలు

అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన అటకెక్కినట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రెండు రాష్ట్రాల శాసనసభల సీట్లు ఇప్పుడిప్పుడే పెరగకపోవచ్చు. 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికైనా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న గ్యారంటీ కనిపించటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచటాన్ని రెండు రాష్ట్రాల బిజెపి శాఖలు గట్టిగా వ్యతిరేకిస్తున్నందునే ఈ ప్రతిపాదనను అటకెక్కించారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బిజెపి శాఖల సీనియర్ నాయకుల డిమాండ్ మేరకే అమిత్ షా అసెంబ్లీ సీట్లు పెంచే ప్రతిపాదనకు అడ్డంపడినట్లు తెలిసింది. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ సీట్ల పెంపును అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని, దీనివలన బిజెపికి నష్టమే తప్ప లాభం లేదని తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకులు అధినాయకత్వానికి చెప్పారని అంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు పార్లమెంటు ఆవరణలో అసెంబ్లీ సీట్ల పెంపకం గురించి మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల డిమాండ్ మేరకే అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచే ప్రతిపాదనను మూలనపడవేశారని చంద్రబాబు తెలంగాణ సిఎంకు చెప్పినట్లు తెలిసింది.