జాతీయ వార్తలు

అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రత: బిఎస్‌ఎఫ్ చీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 27: ఈఏడాది అమర్‌నాథ్ యాత్ర భగ్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉందని సరిహద్దు భద్రతాదళం (బిఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ కెకె శర్మ మంగళవారం నాడిక్కడ వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని యాత్రను శాంతియుతంగా జరిగే చూడడానికి బిఎస్‌ఎఫ్ దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.‘ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు పెను ముప్పు ఉందన్న సంకేతాలున్నాయి. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తిప్పికొట్టడానికి బిఎస్‌ఎఫ్ సిద్ధంగా ఉంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ఈమేరకు దళాలను అప్రమత్తం చేశాం’అని ఆయన తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అమర్‌నాథ్ యాత్రికులకు డిజి భరోసా ఇచ్చారు. అమర్‌నాథ్ యాత్ర గురువారం నుంచి మొదలవుతోంది. ఆగస్టు 7 వరకూ యాత్ర సాగుతుంది. శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్ ఆలయం ఉంది. 12,756 అడుగులు ఎత్తులో వేంచేసి ఉన్న ఆలయానికి ఏటా ఇదే సీజన్లో యాత్రికులు తరలివస్తారు.