జాతీయ వార్తలు

జైలు అధికారులు తీవ్రంగా కొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనను జైలు అధికారులు తీవ్రంగా కొట్టారని, లైంగిక దాడి చేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ ఆమె మంగళవారం కోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ముంబయిలోని బైకులా మహిళా జైలులో ఖైదీగా ఉన్న ఇంద్రాణిపై తోటి ఖైదీలతో కలిసి జైలులో అల్లర్లకు పాల్పడ్డారన్న ఆరోపణపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ఇంద్రాణి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న షీనా బోరా కేసును విచారిస్తున్న సిబిఐ కోర్టు ఆమెను బుధవారం కోర్టులో హాజరుపరచాలని జైలు అధికారులను ఆదేశించింది. జైలులో మంజు గోవింద్ షెట్టి అనే మహిళా ఖైదీని జైలు అధికారులు తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోవడం ఈ గొడవకు ప్రధాన కారణం. ఈ నెల 23న ఓ మహిళా జైలు అధికారి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన 45 ఏళ్ల మంజు శుక్రవారం రాత్రి జెజె ఆస్పత్రిలో చనిపోయింది. ఈ సంఘటనకు నిరసనగా జైల్లోని మహిళా ఖైదీలు ఆందోళనకు దిగారు. కాగా, మంజును జైలు అధికారులు చిత్రహింసలు పెట్టారని, ఆమె మర్మావయంలోకి కర్రను జొనిపారని పోలీసులు అంటున్నారు. జైలు సిబ్బందికి వ్యతిరేకంగా దాఖలయిన ఎఫ్‌ఐఆర్‌లో ఈ ఆరోపణలున్నాయని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని నగర డిసిపి (జోన్-3) అఖిలేష్ సింగ్ చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నాగపడ పోలీసులు జైలుసిబ్బందిపై హత్యానేరంకింద కేసు నమోదు చేశారు. తాను ఇంద్రాణిని కలవడానికి వెళ్లినప్పుడు ఆమె తన శరీరంపై గాయాలను చూపించారని, లైంగిక దాడి చేస్తామని జైలు అధికారులు తనను బెదిరించారని చెప్పినట్లు ఇంద్రాణి తరఫు న్యాయవాది గుంజన్ మంగ్లా పిటిషన్‌లో పేర్కొన్నారు.