జాతీయ వార్తలు

చరిత్ర సృష్టించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమ సమాజ నిర్మాణం, మీడియా స్వాతంత్య్రం, పారదర్శకత, బీదరికం నిర్మూలన, కుల వ్యవస్థ తొలగింపు లక్ష్యంగా పనిచేస్తున్న తనను రాష్టప్రతి పదవికి గెలిపించటం ద్వారా కొత్త చరిత్ర సృష్టించాలని ప్రతిపక్షం అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పిలుపు ఇచ్చారు. మీరాకుమార్ మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చరిత్రను సృష్టించే అవకాశం మీకు లభిస్తోంది, దీనిని జార విడుచుకోవద్దు, అంతరాత్మ సాక్షిగా తనకు ఓటు వేసి చరిత్ర సృష్టించాలని ఆమె ఎంపీలు, శాసన సభ్యులకు విజ్ఞప్తి చేశారు. రాష్టప్రతి ఎన్నికలో కులం చర్చనీయాంశం కాకూడదని మీరాకుమార్ స్పష్టం చేశారు. తన ఎన్నికల ప్రచారాన్ని గుజరాత్‌లోని మహాత్మా గాంధీ ఆశ్రమం సాబర్‌మతి నుండి ప్రారంభిస్తానని ప్రకటించారు. రాష్టప్రతి పదవికి ఇద్దరు దళితులు పోటీ
పడటంపై దేశంలోని పలు ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది, తుపాను మాదిరిగా ఈ అంశం లేస్తోంది, అయితే ఈ చర్చ మూలంగా సమాజం నిజస్వరూపం బైటికి వస్తోందని ఆమె అన్నారు. గతంలో రాష్టప్రతి పదవికి పోటీ జరిగినప్పుడు ఉన్నత వర్గంవారు పోటీ పడినప్పుడు కులం గురించి చర్చ జరగలేదు, వారి మంచిచెడ్డలు, సామర్థ్యం గురించి మాత్రమే చర్చ జరిగింది తప్ప వారి కులం గురించి చర్చ జరగలేదని మీరాకుమార్ చెప్పారు. రాష్టప్రతి పదవికి దళితులు పోటీ చేసినప్పుడే కులం గురించి ఎందుకు చర్చ జరుగుతోందని ప్రశ్నించారు. కులాన్ని భూస్థాపితం చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. జెడి(యు) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గురించి అడిగిన ప్రశ్నకు రాజకీయాల్లో ఇలా జరగడం మామూలేనని అన్నారు. అంతరాత్మ సాక్షిగా ఓటు వేసి చరిత్ర సృష్టించాలని కోరుతూ ఎంపీలు శాసన సభ్యులకు లేఖ రాసినట్లు మీరాకుమార్ వెల్లడించారు. సుష్మా స్వరాజ్ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నంచగా ప్రతిపక్షం, స్వపక్షం నాయకులు, సభ్యులందరూ స్పీకర్‌గా తన పనిని ప్రశంసించారేతప్ప పక్షపాతంతో వ్యవహరంచినట్లు ఎక్కడా ఆరోపించలేదని బదులిచ్చారు. ఉన్నతస్థాయి దళితుడికే మద్దతు ఇస్తానని బిఎస్‌పి అధినాయకురాలు మాయావతి చేసిన ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాష్టప్రతి ఎన్నికల్లో కులానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండకూడదన్నారు. ఇంటి అద్దె, బంగళాను స్వంతం చేసుకోవటం వంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మీరాకుమార్ చెప్పారు. అంతరాత్మ సాక్షిగా ఓటు వేయటం అంటే క్రాస్ ఓటింగ్ చేయాలనుంటున్నారా? అని ఒక విలేఖరి అడగ్గా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిలుపు ఇచ్చానని మీరాకుమార్ వివరించారు. రాష్టప్రతి ఎన్నికలో సిద్ధాంతాలను తీసుకురాకూడదంటూ సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేసిన సూచన గురించి ప్రశ్నించగా, అత్యున్నత పదవికి ఎన్నిక జరిగే సమయంలో సిద్ధాంతాల గురించి మాట్లాడకుండా ఎలా ఉంటామని ఎదురు ప్రశ్నించారు. మహాత్మా గాంధీ నుండి స్ఫూర్తి పొందేందుకు సాబర్‌మతీ ఆశ్రమం నుండి ప్రచారం ప్రారంభిస్తున్నానని తెలిపారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలు, బీద ప్రజల అభ్యున్నతికి సంబందించిన పథకాల అమలు సక్రమంగా జరగటం లేదు, ఈ పథకాలను విస్మరిస్తున్నారని మీరాకుమార్ ఆరోపించారు. ఓడిపోతారని తెలిసి కూడా ఎందుకు పోటీ చేస్తున్నారని ఒక విలేఖరి అడుగగా, ఓడిపోతానని మీరెలా చెబుతారా? అదే నిజమైతే ఎన్నిక ఫలితం ప్రకటించవచ్చు కదా అంటూనే పోరాటం కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. రాష్టప్రతి పదవికి తాను కులం ఆధారంగా పోటీ పడటం లేదు, సిద్ధాంతపరంగా పోటీ చేస్తున్నానని మీరాకుమార్ ప్రకటించారు.