జాతీయ వార్తలు

చేనేతపై జిఎస్‌టి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 27: చేనేతపై విధిస్తున్న జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి కర్నూలు ఎంపి బుట్టా రేణుక డిమాండ్ చేశారు. బుట్టా రేణుకతోపాటు ఆ పార్టీ ఎంపి అవినాష్‌రెడ్డి, ఏపి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. దేశంలో వ్యవసాయం తరువాత అత్యధికులు చేనేత వృత్తిలో ఉన్నారని వస్త్ర పరిశ్రమపై జిఎస్‌టి విధిస్తే వారి బతుకులు మరింత దుర్భరమవుతాయని రేణుక, అవినాష్‌రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. చేనేతకు జిఎస్‌టి నుండి మినహాయింపు ఇస్తే చేనేత కార్మికుల జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని రేణుక చెప్పారు. చేనేత రంగంపై దాదాపు43 లక్షల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించటం లేదన్నారు. చేనేత మూలంగా బతుకు గడవక చాలా మంది చేనేత కార్మికులు నిత్య కూలీలుగా మారిపోతున్నారని ఆమె జైట్లితో చెప్పారు. ఆగస్టు 7 తేదీని హాండ్లూం దినంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చేనేతపై పన్ను ఎలా విధిస్తుందని ఆమె అన్నారు. దేశ సంస్కృతితో ముడిపడి ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు దీనిపై ప్రకటించిన జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చేనేతపై జిఎస్‌టి విధించినందుకు నిరసనగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఈరోజు జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. చేనేతకు జిఎస్‌టి నుండి మినహాయింపు ఇవ్వకపోతే చేనేత రంగం కుదేలవుతుందని ఫ్రంట్ కన్వీనర్ టి.శ్రీనివాస్ విశ్వనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. జిఎస్‌టి మూలంగా చేనేత రంగంపై దాదాపు నలభై కోట్ల రూపాయల భారం పడుతోందని చెప్పారు. దీని మూలంగా ప్రత్యక్షంగా మూడు లక్షలు, పరోక్షంగా మూడు లక్షల మంది చేనేత కార్మికులపై ప్రభావం పడుతుందని తెలిపారు.