జాతీయ వార్తలు

రైలు ప్రయాణికులను దోచుకున్న ఆంగతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 27: తోటి ప్రయాణికులుగా నటించిన ఆగంతకులు రైలుబోగీలోని ఆరుగురు యువకులకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి డబ్బు దోచుకుని ఉడాయించిన సంఘటన ఇది. సోమవారం రాత్రి యశ్వంతాపూర్ వద్ద నిద్రలోకి జారుకున్న ఆరుగురు యువకులు మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా లేవకపోవడంతో అనుమానించిన బోగీలోని ఇత ర ప్రయాణికులు కాజీపేటలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరులో పెయింటింగ్, ఇతర పనులు చేసుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు సోమవారం రాత్రి యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో లక్నోకు బయలుదేరారు. జనరల్ బోగీలో ఎక్కిన వీరితో కొందరు ఆగంతకులు మాటలు కలిపి కొద్దిసేపటి తరువాత కూల్‌డ్రింక్ ఇచ్చారు. కానీ అందులో మత్తుమందు కలిపిన విష యం తెలియని వారు ఆ కూల్‌డ్రింక్ తాగి ఒక్కొక్కరు స్పృహ కోల్పోయారు. ఇదే అదునుగా ఆ యువకుల వద్ద ఉన్న నగదు తీసుకుని మార్గ మధ్యం లో దిగిపోయారు. ఈ రైలు మంగళవారం ఉదయం సికింద్రాబాద్ చేరుకున్నా కూడా యువకులు నిద్ర లేవకపోవడంతో అనుమానం వచ్చిన బోగీలోని మరికొందరు ప్రయాణికులు రైలు మధ్యాహ్నం కాజీపేటకు చేరుకోగానే రైల్వే పోలీసులకు ఫిర్యా దు చేసారు. దాంతో జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ పోలీసులు హుటాహుటిన అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురు యువకులను వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుశీల్ జైస్వాల్, రాణ్యా దుబే, రాజ్‌నారాయణ్, ఇంద్రజిత్‌గా, మహేష్‌సావంత్ మధ్యప్రదేశ్‌కు చెందినవాడుగా, వీరినుంచి అగంతకులు 27వేల రూపాయలు ఎత్తుకుపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులకు ఒకరితో ఒకరికి పరిచయం లేదని, వీరంతా ఎవరికివారు యశ్వంతాపూర్‌లో ఈ రైలులో ఎక్కారని తెలుస్తోంది.
ఆరుగురు యువకుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాజీపేట రైల్వే పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.