జాతీయ వార్తలు

డిఎంకె-కాంగ్రెస్ పొత్తుకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 25: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసే ప్రక్రియకు డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు శుక్రవారం శ్రీకారం చుట్టాయి. డిఎంకె అధ్యక్షుడు కరుణానిధితో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇందులో భాగంగా చర్చలు జరిపారు. అయితే కేవలం తాము పొత్తు గురించి మాత్రమే మాట్లాడుకున్నామని, ఏ పార్టీ ఏ స్థానాలకు పోటీచేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమావేశం అనంతరం గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. సీట్ల పంపిణీ వ్యవహారం అత్యంత సంక్లిష్టమైనది కాబట్టి చర్చల ప్రక్రియద్వారానే దీన్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని, అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆజాద్ వెల్లడించారు. ఈ విషయంలో డిఎంకెకు కొంత వ్యవధినిచ్చామని ఆ పార్టీ అంతర్గత చర్చల అనంతరమే సీట్ల ఖరారు జరుగుతుందని తెలిపారు. డిఎంకెతో కలిసే రాష్ట్ర ఎన్నికల్లో పోటీచేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ తాజా చర్చలు జరిగాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సొంతంగా పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకెతో కలిసి పోటీచేసినా ఐదు సీట్లు మాత్రమే దక్కించుకుంది.

chitram డిఎంకె అధ్యక్షుడు కరుణానిధితో ఎన్నికల పొత్తుపై
చర్చిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్