జాతీయ వార్తలు

యాంగ్రి యంగ్ కాప్ శ్రేష్ఠా ఠాకూర్ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 2: యాంగ్రీ యంగ్ కాప్ శ్రేష్ఠా ఠాకూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వారం రోజుల క్రితం బులంద్‌షహర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న బిజెపి స్థానిక కార్యకర్తకు ఫైన్ వేసిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు నినాదాలు చేయడంతో వారితో వాగ్వాదానికి దిగి, వారిపై చర్యతీసుకున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠా ఠాకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సంఘటనతో సంబంధమున్న ఐదుగురు బిజెపి కార్యకర్తలను కూడా ఆమె జైలుకు పంపింది. దీంతో ఆ పార్టీ స్థానిక నేతలు చేసిన వత్తిడివల్లే రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసిందని తెలియవచ్చింది. కార్యకర్తల మనోధైర్యాన్ని పెంపొందించేందుకే ఈ చర్య తీసుకొని ఉంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. బదిలీలు ఉద్యోగంలో సర్వసాధారణమని అయితే తన బ్యాచ్‌లో తనను మాత్రమే బదిలీ చేశారని శ్రేష్ఠా ఠాకూర్ చెప్పారు. బులంద్‌షహర్‌లో పనిచేస్తున్న తనను బరాయిచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని తెలిపారు. ఢిల్లీలో తన కుటుంబ సభ్యులుంటున్నారని అక్కడికి బరాయిచ్ చాలా దూరమని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 234 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.