జాతీయ వార్తలు

యుపి, బిహార్‌లలో క్రాస్ ఓటింగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: రాబోయే రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు అనుకూలంగా ప్రతిపక్షాల సభ్యులనుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బిజెపి ఆశిస్తోంది. సమాజ్‌వాది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అలాగే కోవింద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఆ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ వర్గానికి చెందినవారు కోవింద్‌కు ఓటు వేస్తారని బిజెపి వర్గాలు అంటున్నాయి. రాష్టప్రతి పదవికి కోవింద్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత లోక్‌సభ సభ్యుడైన ములాయం సింగ్ ఆయనకు మద్దతు ప్రకటించారు. కాగా, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న శివపాల్ యాదవ్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశం కావడం కూడా ఆయన భవిష్యత్ వ్యూహంపై ఊహాగానాలకు తెరతీసింది. సమాజ్‌వాది పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు కోవింద్‌కు ఓటు వేస్తారని తాను భావిస్తున్నట్లు కోవింద్ ప్రచార శిబిరం వర్గాలు తెలిపాయి. మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ పార్టీ భవిష్యత్తు సైతం అగమ్యగోచరంగా ఉండడంతో ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలన్న మాయావతి ఆదేశాలను ధిక్కరించి ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కోవింద్‌కు ఓటేసే అవకాశం లేకపోలేదు. 403 మంది సభ్యులుండే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సమాజ్‌వాది పార్టీకి 54 మంది, బిఎస్పీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు. సమాజ్‌వాది పార్టీకి లోక్‌సభలో అయిదుగురు, రాజ్యసభలో 18 మంది సభ్యులున్నారు. అలాగే బిఎస్పీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే బిహార్‌లో ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ బహిరంగంగా కోవింద్‌కు మద్దతు ప్రకటించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కాంగ్రెస్, ఆర్‌జెడి శిబిరాలనుంచి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేకపోలేదని బిజెపి నాయకుడొకరు చెప్పారు. మీరాకుమార్‌కు అనుకూలంగా వీలయినంత ఎక్కువ ఓటింగ్ జరిగేలా చూడడానికి ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ కాంగ్రెస్ సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో పార్టీ విప్‌లకు అవకాశం లేని కారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకిష్టమైన వ్యక్తికి ఓటేయవచ్చు. ఈ నెల 17న రాష్టప్రతి ఎన్నికకు పోలింగ్ జరగనుండగా, 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

చిత్రం..రాష్టప్రతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరాకుమార్ ఆదివారం పుదుచ్చేరి
ముఖ్యమంత్రి వి.నారాయణసామిని కలుసుకున్నప్పటి చిత్రం