జాతీయ వార్తలు

రెండు వారాల్లో వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎంలు) ట్యాంపరింగ్ అయ్యాయంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ట్యాంపరింగ్‌పై దర్యాప్తును ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతోకూడిన ధర్మాసనం విచారించింది. మాయావతి నాయకత్వంలోని బిఎస్పీసహా పలు రాజకీయ పార్టీలు ఈ తరహా పిటిషన్లు దాఖలు వేసినట్టు ఎన్నికల సంఘం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది తెలిపారు. అవన్నీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని బెంచ్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల సంఘం చెబుతున్న పిల్ మరో అంశానికి సంబంధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎంఎల్ శర్మ చెప్పారు. ‘మేం పిటిషన్‌లో పేర్కొన్న అంశం మరొకటి. ఎన్నికల సంఘం చెబుతున్నదానికి మేం చెబుతున్నదానికి సంబంధం లేదు. ఈ విషయంలో ఇసి తప్పుదోవపట్టిస్తోంది. ఇసి చెబుతున్న పిటిషన్లు రాజకీయ పార్టీలు దాఖలు చేసినవి’ అని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇవిఎంల పనితీరును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశామని శర్మ అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఇసిని ఆదేశించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇవిఎంలు ట్యాంపరింగ్ అయ్యాయంటూ పిటిషనర్ ఆరోపించారు.