జాతీయ వార్తలు

ఆ ఆరుగురు ఎంపీల ఓట్లూ కోవింద్‌కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఎన్‌డిఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజ్యసభలో మద్దతు పెరగనుంది. ఆరుగురు ఇండిపెండెంట్ సభ్యులు కోవింద్‌కే ఓటు వేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వారిలో కొందరు పలు అంశాలపై ఎన్‌డిఏకు మద్దతు ఇస్తున్నారు. ఒకరిద్దరు దూరంగా ఉన్నప్పటికీ రాష్టప్రతి ఎన్నికల విషయంలో కోవింద్‌కే మద్దతు ఇస్తారని అంటున్నారు. బిజెపి సీనియర్ నాయకుడొకరు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పారిశ్రామిక వేత్త రాజీవ్ చంద్రశేఖర్ (కేరళ), మహారాష్ట్ర బిజెనెస్‌మేన్ సంజయ్ దత్తాత్రేయ కాకడే బిజెపిలో చేరారు. అలాగే జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర బిజెపి మద్దతుతోనే ఎగువ సభకు ఎన్నికయ్యారు. పరిమళ్ నాథ్‌వానీ ఇండిపెండెంట్ సభ్యునిగా ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ బహిష్కత ఎంపీ అమర్‌సింగ్, ఒడిశాకు చెందిన ఎవి స్వామి ఇండిపెండెంట్ హోదాతో కొనసాగుతున్నారు. ‘వారందరినీ కలుస్తున్నాం. కోవింద్‌కే ఓటేయాలని అడుగుతున్నాం’ అని బిజెపి సీనియర్ నేత ఒకరు తెలిపారు.