జాతీయ వార్తలు

టూరిస్ట్ స్పాట్‌గా ‘మోదీ టీ స్టాల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 3: దేని దశ ఎప్పుడు ఎలాతిరుగుతుందో ఎవరూ చెప్పలేం. వ్యక్తి కావచ్చు లేదా సంస్థ కావచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ అమ్మిన స్టాల్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. ఆ టీ స్టాల్‌ని టూరిస్ట్ స్పాట్‌గా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని వాద్‌నగర్ స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఉన్న చిన్న టీ స్టాల్‌లో నరేంద్ర మోదీ చిన్నప్పుడు టీ అమ్మేవారు. ఇప్పుడా స్టాల్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయంతో మెహ్‌సానా జిల్లాలోని వాద్‌నగర్ ప్రపంచం టూరిస్ట్ మ్యాప్‌పైకి ఎక్కనుంది. దీన్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటకం, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) మంత్రిత్వశాఖ అధికారులు ఆదివారం వాద్‌నగర్ సందర్శించారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ సారథ్యంలోని బృందం టీ స్టాల్ ప్రాంతాన్ని చూసి వెళ్లింది. టీ స్టాల్ ఒరిజినాలిటీ పాడవుకుండా మోడరన్ టచ్ ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ‘మోదీ జన్మస్థలం వాద్‌నగర్ కావడం దాన్ని అభివృద్ధి చేయడంవల్ల దానికి మంచి ప్రాచుర్యం లభించనుంది. దానికి తగ్గట్టే చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. మోదీ చిన్నప్పుడు తండ్రితో కలిసి వాద్‌నగర్ టీ స్టాల్‌లో టీ అమ్మేవారు.