జాతీయ వార్తలు

శిశువు ఆరోగ్యం దృష్ట్యా గర్భస్రావానికి కోర్టు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: శిశువు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గర్భస్రావం చేయించుకోడానికి ఓ మహిళకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. కడుపులో ఉన్న 26 వారాల బిడ్డ గుండె సంబంధిత సమస్యతో ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. ఒకవేళ శిశువు జన్మించినా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటుందని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి స్పష్టం చేసింది. దీనిపై ఆసుపత్రి మెడికల్ బోర్డు నివేదికను అందించింది. గర్భస్రావం ఒకటే పరిష్కారమని బోర్టు పేర్కొంది. అంతేకాదు నెలలు నిండే వరకూ గర్భం ఉంచితే తల్లి ఆరోగ్యం క్షీణిస్తుందని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి తన నివేదికలో స్పష్టం చేసింది. సోమవారం కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎం ఖన్వీకర్‌తో కూడిన ధర్మాసనం గర్భస్రావం చేయించుకోడానికి మహిళను అనుమతి ఇచ్చింది. ‘ఆసుపత్రి మెడికల్ బోర్టు నివేదికను పరిశీలించిన తరువాత అబార్షన్ చేయించుకోడానికి అనుమని మంజూరు చేస్తున్నాం’ అని న్యాయమూర్తులు ప్రకటించారు. కడుపులో శిశువు పరిస్థితి అసాధారణంగా ఉందని, గుండెకు సంబంధించిన చాలా క్లిష్టమైన సమస్యలున్నట్టు వైద్యులు చెప్పారు. దీంతో గర్భిణీ, ఆమె భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరవై వారాల తరువాత అబార్షన్‌కు అనుమతి ఇవ్వకూడదన్న సెక్షన్ 3(2)(బి)ను దంపతులు కోర్టులో సవాల్ చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ఇంతకుముందు ఆదేశించింది. ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో ఏడుగురు సభ్యులతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓ బోర్డును ఏర్పాటు చేసింది. సోమవారం నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు మహిళకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.