జాతీయ వార్తలు

డ్రాగన్ కవ్వింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: డ్రాగన్ బుసకొడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. భారత్‌ను రెచ్చగొడుతోంది. భారతదేశమే హద్దులు మీరి తనకు ద్రోహం చేస్తోందని సరికొత్త వాదన చేస్తోంది. తమది 1962నాటి భారత్ కాదని రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేస్తే తమదీ 1962 నాటి చైనా కాదని తిప్పికొట్టింది. సిక్కిం సెక్టార్‌లో భారత దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్టా తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు యుద్ధానికి దిగేందుకు కూడా సిద్ధమేనంటూ చైనా హెచ్చరికలు జారీ చేస్తోంది. డోకాలా రోడ్డు నిర్మాణం విషయంలో భారత దేశం తమకు ద్రోహం చేసిందని చైనా ఆరోపిస్తోంది. భారత దేశం తమ సైనికులను ఉపసంహరించుకోకపోతే చైనా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు యుద్ధానికి దిగేందుకు కూడా వెనకాడదని చెబుతోంది. బ్రిటిష్ పాలకులు, చైనాకు మధ్య 1890లో కుదిరిన ఒప్పందాన్ని భారత దేశం ఇంత కాలం గౌరవించి ఇప్పుడు గొడవ చేయటం ఏమిటని చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి గెంగ్ షుఆంగ్ సోమవారం ప్రశ్నించారు. భారత దేశం మొదటి ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రు కూడా 1890 ఒప్పందాన్ని ఆమోదించిన విషయాన్ని మరిచిపోరాదని ఆయన చెప్పారు. భారత దేశం ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ డోక్లోమ్ నుండి తన సైనికులను వెంటనే ఉపసంహరించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారత సైనికులు నెల రోజుల క్రితం వాస్తవాధీన రేఖను దాటి తన భూభాగంలోకి వచ్చి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆయన చెప్పారు. భారత సైనికులు తమ భూభాగంలోకి చొచ్చుకు రావటం అత్యంత తీవ్రమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. ‘‘జరిగిందేమిటో అందరికీ తెలిసిందే. గ్రేట్ బ్రిటన్ పాలకులతో చైనా చేసుకున్న ఒప్పందం స్పష్టం. సిక్కిం సెక్షన్‌లో సరిహద్దు 1890లోనే నిర్ధారణ జరిగింది. చైనా-సిక్కింల మధ్య ఉన్న 220 కిలోమీటర్ల సరిహద్దులను స్పష్టంగా గుర్తించారు. దీని ప్రకారం డోక్లోమ్ మా భూభాగం, ఈ భూభాగంలోకి చొచ్చుకు రావటం ద్వారా భారత దేశం తప్పు చేసింది’’ అని షువాంగ్ అన్నారు. జూలై 6నుంచి జర్మనీలో జరిగే జి-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు ఆయన తనకు సమాచారం లేదని దాటవేశారు. ఈ ఉద్రిక్తతల కారణంగానే మానససరోవర్ యాత్రకు వెళ్లేందుకు సిక్కింలోని నాథులా పాస్ మార్గాన్ని చైనా మూసి వేసింది. టిబెట్‌లో రోడ్లు చెడిపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముందుగా చెప్పినప్పటికీ, సిక్కిం సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనే ఇందుకు కారణమని తరువాత సంకేతాలిచ్చింది. మరోవైపు వివాదాస్పద డొకాలా మార్గంలో రోడ్డు నిర్మాణం భారత్‌కు భద్రతాపరమైన తీవ్ర ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయని మన దేశ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో 1962 భారత దేశానికి ప్రస్తుత భారత దేశానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నదంటూ రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను కూడా చైనా తప్పుపడుతోంది. 1962 భారత దేశానికి 2017 భారత దేశానికి మధ్య తేడా ఉన్నట్లే 1962 చైనాకు ప్రస్తుత చైనాకు కూడా ఎంతో తేడా ఉన్నదనేది మరిచిపోరాదని చైనా అధికారులు చెబుతున్నారు. 1962లో జరిగిన యుద్ధంలో 722 మంది చైనా సైనికులు మరణిస్తే భారత దేశానికి 4,383 మంది సైనికులు వీరమరణం పొందారు. 1962 లాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకపోయినా రెండు దేశాల మధ్య యుద్ధమంటూ జరిగే ప్రాణ నష్టం భారీగా ఉంటుందని అంటున్నారు. సిక్కిం సెక్టార్ సరిహద్దు సమస్యను రెండు దేశాలు సామరస్యపూర్వంగా పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధం వరకు పరిస్థితులను తీసుకుపోకూడదని పరిశీలకులు చెబుతున్నారు.

చిత్రం.. ఇండో-చైనా సరిహద్దులో ఇరుదేశాల సైనికులు (ఫైల్)