జాతీయ వార్తలు

ఉగ్రవాదమే సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఇజ్రాయిల్‌తో భారత్ బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఇజ్రాయిల్, జర్మనీల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతాన్యాహూతో రెండు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చిస్తానని ఆయన అన్నారు. యూదుల దేశమైన ఇజ్రాయిల్‌ను సందర్శిస్తున్న మొదటి ప్రధాని మోదీయే కావటం విశేషం. ‘‘రేపటి నుంచి ఇజ్రాయిల్‌లో నా చారిత్రక పర్యటన మొదలవుతుంది. ఈ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా నేను ఎంతో ఆశాభావంతో ఉన్నాను. ఇజ్రాయిల్ భారత్‌కు ప్రత్యేక భాగస్వామి. ఇరు దేశాల ప్రజలను దగ్గర చేసే దిశగా ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూతో నా చర్చలు సాగుతాయి.’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌తో వాణిజ్య భాగస్వామ్యంతో పాటు రెండు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న ఉగ్రవాదం వంటి సమస్యలపైనా లోతుగా చర్చిస్తానన్నారు. రెండు దేశాల మధ్య పాతిక సంవత్సరాలుగా దౌత్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. ‘‘నా పర్యటన ఇజ్రాయిల్ సమాజంతో కలిసే అవకాశాన్ని కల్పిస్తోంది. రెండు దేశాల మధ్య వారధిగా నిలిచిన అక్కడి ప్రవాస భారతీయులతో నేను మాట్లాడబోతున్నాను.’’ అని మోదీ పేర్కొన్నారు. అక్కడి సి ఈవోలు, స్టార్టప్ యజమానులతోనూ తాను భేటీ అవుతానన్నారు. వారి వ్యాపారం విస్తరించటానికి, పెట్టుబడులు పెట్టడానికి భారత్‌లో ఉన్న అవకాశాలపై చర్చిస్తానని మోదీ వివరించారు. టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో ఇజ్రాయిల్ సాధించిన విజయ రహస్యాలను తరచి చూస్తానని మోదీ పేర్కొన్నారు. జూలై ఆరున మోదీ జర్మనీకి వెళ్తారు. అక్కహ హాంబర్గ్ పట్టణంలో జూలై 7-8లలో జరిగే జి-20సదస్సులో మోదీ పాల్గొంటారు. జి-20 నేతలు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై విస్తృతంగా చర్చిస్తారని తాను భావిస్తున్నట్లు మోదీ అన్నారు. ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకోసం జి-20 సదస్సు ఫలవంతమైన చర్చ జరుపుతుందని తాను ఆశిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు. నిరుడు హాంగఝూ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితిని సమీక్షిస్తామని కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా వాణిజ్యం, డిజిటలైజేషన్, ఆరోగ్యం, ఉపాధి, వలస, మహిళా సాధికారత, ఆఫ్రికాతో భాగస్వామ్యం వంటి అంశాలు జి-20 సదస్సులో చర్చకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటుగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక అంశాలు, పరస్పర ప్రయోజనకర అంశాలపై కూడా తాను చర్చించనున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.