జాతీయ వార్తలు

ఇప్పటికిప్పుడు విచారించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తన బెయిల్ పిటిషన్‌ను సత్వరం విచారించాలన్న కర్ణన్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టు ధిక్కారణ ఆరోపణపై కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఆరు నెలల జైలుశిక్ష పడింది. అరెస్టును నెల రోజులపైనే తప్పించుకు తిరిగిన కర్ణన్‌ను గత నెల 20న అదుపులోకి తీసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉపసంహరించుకోవడంతోపాటు బెయిల్ మంజూరు చేయాలంటూ కర్ణన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూన్ 21న వెకేషన్ బెంచ్ కూడా బెయిల్ మంజూరుకు నిరాకరించింది. తిరిగి సోమవారం పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కర్ణన్ తరఫున న్యాయవాది మాథ్యుస్ జె నెడుంపర వాదనలు వినిపించారు. బెయిల్‌కోసం ఈ నెల 21న వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని బెంచ్ స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. కాగా అజ్ఞాతంలో ఉండగానే 62 ఏళ్ల కర్ణన్ పదవీ విరమణ చేశారు. మే 9న సుప్రీం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత నెల 20న కొయంబత్తూర్‌లో కర్ణన్‌ను అరెస్టుచేశారు. బెయిల్ కోసం అనేకసార్లు కోర్టును ఆశ్రయించినా ఆయనకు ఉపశమనం లభించలేదు.