జాతీయ వార్తలు

పూరీలో కన్నుల పండువగా బహుదా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ, జూలై 3: ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర జరిగి ఎనిమిది రోజులు పూర్తయి, తొమ్మిదో రోజున నిర్వహించే దేవతా విగ్రహాలను తిరిగి తీసుకువచ్చే ‘బహుదా యాత్ర’ కార్యక్రమాన్ని సోమవారం కన్నుల పండువలా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు హాజరయ్యారు. గుడీచా ఆలయంలో తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న అనంతరం సోదరుడు బాలభద్ర, సోదరి దేవి సుభద్రాలతో కలిసి జగన్నాథుడు రంగురంగుల్లో ప్రత్యేకంగా అలంకరించిన రథాలపై జగన్నాథుని స్థిరనివాసమైన శ్రీమందిరానికి సోమవారం తరలివచ్చారు. దారి పొడవునా భక్తుల జయ జయ ధ్వానాలతోపాటు వివిధ రకాల వాయిద్యాలు, శంఖానాదాల నడుమ రథయాత్ర సాగింది. 45 అడుగుల ఎత్తున్న ‘నందిఘోష్’గా పిలువబడే రథంపై జగన్నాథుడు, 44 అడుగుల ఎత్తు రథం ‘తలద్వాజా’పై బాలభద్రుడు, 43 అడుగుల ఎత్తు రథం ‘దర్పదాలన్’పై సుభద్ర తరలివచ్చారు. దీంతో జూన్ 25న ప్రారంభమైన జగన్నాథ యాత్ర విగ్రహాలు తిరిగి శ్రీమందిర్ చేరుకోవడం ఉత్సవాలు ముగిసినట్లయింది. ఈ కార్యక్రమానికి 3వేల మంది పోలీసులు, 180 సిసిటివీలతో గట్టినిఘా ఏర్పాట్లు చేశారు.

చిత్రం.. పూరీలో సోమవారం నిర్వహించిన ‘బహుదా యాత్ర’