జాతీయ వార్తలు

ధైర్యంగా ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ముక్కుసూటిగా, ధైర్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించ గలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన తర్వాత స్వాతంత్య్రం సాధించిన దేశాలన్నీ అద్భుతంగా అభివృద్ధి సాధించాయని కానీ మన దేశం మాత్రం అనుకున్నంత ప్రగతి సాధించలేక పోయిందని పేర్కొన్నారు. మార్పు తేవాలంటే దానికి కఠిన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగల సత్తా ఉండాలని అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఓ గొప్ప మార్పు తేవాలంటే దానికి ధైర్యంగా ముందడుగు వేయాలని అప్పుడే విజయాన్ని సాధించగలుగుతామని అన్నారు. ఓ కొత్త భారత్‌ను ఆవిష్కరించడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని, మార్పునకు స్వాగతం పలికేలా ఉండేలా తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని ఉద్భోదించారు. వ్యవస్థలో సమూల మార్పులకు కృషి చేయాలని అన్నారు. దీనికోసం సీనియర్ అధికారులతో పరస్పరం సంప్రదింపులు జరపాలని అప్పుడే అనుభవం, కొత్తతరం ఆలోచనల కలబోతతో మెరుగైన పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సివిల్ సర్వీసుకు ఎంపిక కాక ముందు మీరు పడిన కష్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని అదే పంథాలో దేశాభివృద్ధికి, బడుగుల ప్రగతికి అత్యున్నత అధికారులుగా పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి జితేంద్ర సింగ్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. ఢిల్లీలో సోమవారం ఐఏఎస్ అధికారుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ