జాతీయ వార్తలు

చైనా తెగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: భారత్-చైనాల మధ్య తలెత్తిన సిక్కిం వివాదం ముదురుపాకాన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. భారత్‌ను దారికి తెచ్చుకునేందుకు సిక్కిం వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వాలని కూడా చైనా భావిస్తున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. అదే క్రమంలో యుద్ధానికి సన్నద్ధమా అన్నరీతిలో టిబెట్ ఎగువ ప్రాంతాల్లోనూ చైనా సైనిక విన్యాసాలు సాగిస్తోంది. భూమికి 5వేల మీటర్ల ఎత్తులో భారీ స్థాయిలోనే సైనిక విన్యాసాలు సాగుతున్నట్టుగా మీడియా కథనాలు వస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం నుంచి జర్మనీలోని హ్యాంబర్గ్‌లో జి-20 దేశాల కీలక భేటీ జరుగనుండటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరువుతున్నారు. తాజా ప్రతిష్ఠంభనకు పరిష్కారం కనుగొనేందుకు ఈ అవకాశాన్ని ఇరు దేశాల నేతలు వినియోగించుకునే అవకాశాలు సన్నగిల్లాయి. అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడు జరిగినా ఆయా దేశాల నేతలు విడివిడిగా చర్చలు జరిపి ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆనవాయితీ. అయితే సిక్కిం పరిస్థితి వేడెక్కుతున్నా భారత్-చైనా మధ్య ఇలాంటి సుహృద్భావ చర్చలకు ఆస్కారం కనిపించడం లేదు. భారత ప్రధాని మోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపే ప్రసక్తేలేదని చైనా తెగేసి చెప్పింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ద్వైపాక్షిక చర్చలు జరగటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. జి20 సమావేశాల నేపథ్యంలో రెండు దేశాధినేతులు సమావేశమై సిక్కిం సెక్టార్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గిస్తారని పరిశీలకులు ఆశించారు. అయితే హాంబర్గ్‌లో ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేదని చైనా చెప్పటంతో సిక్కిం సెక్టార్‌లో రెండు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.
జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారత్ వైపునుండి ఎలాంటి ప్రతిపాదన వెళ్లలేదు. అదేవిధంగా చైనాకూడా మోదీతో చర్చలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రెండు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్యలకు అనువైన వాతావరణం లేదంటూ చైనా అధికార ప్రతినిధి ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌పై దౌత్యపరమైన వత్తిడి పెంచేందుకే ద్వైపాక్షిక చర్చలు జరగటం లేదని చైనా ప్రకటించిందని అంచనా వేస్తున్నారు.
చైనా సైనిక చర్యకు దిగుతుందా?
జిన్‌పింగ్ స్వదేశానికి తిరిగి రాగానే చైనా సైన్యం డొక్లామ్‌లో భారత సైన్యంపై సైనిక చర్య తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వం, చైనా మీడియా వారం రోజుల నుండి భారత సైనికులను తరిమికొడతాం, గుణపాఠం నేర్పిస్తాం, శిక్షిస్తాం అంటూ హెచ్చరికలు చేయటం తెలిసిందే. ఇదంతా సైనిక చర్యకు సూచనలని పరిశీలకులు భావిస్తున్నారు. భారత సైన్యం డొక్లామ్‌లో భూటాన్ సైనికులకు బాసటగా నిలవటం చైనా పాలకులకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. మామూలుగా అయితే చైనా సైనికులు తమ ఇష్టానుసారం భారత భూభాగంలోకి చొచ్చుకురావటం, కొంత గొడవ తరువాత ఉపసంహరించుకోవటం తరచు జరుగుతోంది. అయితే ఇప్పుడు మొదటిసారి భారత సైనికులు చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయి చైనా సైనికులను అడ్డుకున్నారు. భారత పాలకులు చూపించిన ఈ గుండెధైర్యం చైనా పాలకులకు మింగుడుపడటం లేదు. అందుకే డోక్లామ్ ప్రాంతంలో తిష్టవేసిన భారత సైనికులను తరిమివేసేందుకు చైనా సైనిక చర్య చేపడుతుందని అంటున్నారు. ఇలావుండగా, భారత్‌ను దారికి తెచ్చేందుకు సిక్కిం వేర్పాటువాదులకు చైనా మద్దతు ఇవ్వాలని చైనా మీడియా సూచించింది. భారత పాలకులు సిక్కింను అక్రమంగా తమ దేశంలో కలుపుకున్నారని ఆరోపించింది. సిక్కిం స్వాతంత్రంకోసం పోరాడుతున్న వారికి చైనా మద్దతు ఇవ్వాలని సలహా ఇచ్చాయి. చైనా 2003లో సిక్కింను భారత భూభాగంగా గుర్తించటం తెలిసిందే. అయితే చైనా ఇప్పుడీ విధానాన్ని మార్చుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నడిపించే గ్లోబల్ టైమ్స్ డిమాండ్ చేసింది. భారత్ ప్రాంతీయ పెత్తనం హద్దు మీరుతోంది కాబట్టి దారికితీసుకురావలసిన సమయం వచ్చిందని గ్లోబల్ టైమ్స్ ప్రకటించటం గమనార్హం. భూటాన్ రక్షణ, సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించేందుకు చైనా ఇతర దేశాలను కూడగట్టాలని కూడా గ్లోబల్ టైబ్స్ హితవు చెప్పింది.