జాతీయ వార్తలు

బాధితులకూ పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: బాధితులకు కూడా నష్టపరిహారం చెల్లించే అంశాన్ని హైజాకింగ్ నిరోధక బిల్లులో చేర్చాలని టిఆర్‌ఎస్ సభ్యుడు బూర నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నరసయ్య గౌడ్ సోమవారం లోక్‌సభలో హైజాక్ నిరోధక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ విదేశాల్లో జరిగే విమాన ప్రమాదాల్లో చిక్కుకున్న భారతదేశ బాధితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు సంబంధించిన అంశాన్ని కూడా హైజాకింగ్ నిరోధక బిల్లులో పొందుపరచాలన్నారు. బీజింగ్ ప్రొటోకాల్‌పై సంతకం చేయని దేశాలతో కూడా హైజాకింగ్‌కు సంబంధించిన అంశాలపై ఒప్పందం చేసుకోవాలని నరసయ్యగౌడ్ సూచించారు. విమానం హైజాక్‌కు గురైనప్పుడు ఇతర దేశాలు ఎలా స్పందించాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశంపై భారతదేశం స్పష్టమైన స్వంత విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ఖాట్మండు నుండి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి ఖాందహార్‌కు తరలించే సమయంలో హైజాకర్లు విమానాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్‌లలో ఆపారని, ఆ తరువాత దానిని ఖాందహార్‌కు తీసుకుపోయారని గుర్తు చేస్తూ, ఇలాంటి సమయంలో ఆయా దేశాలు ఎలా వ్యవహరించాలనేది స్పష్టం కావాలని నరసయ్య గౌడ్ చెప్పారు.