జాతీయ వార్తలు

ఆస్తుల వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: తమ ఆస్తులు, ఆదాయాల వివరాలను సమర్పించాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) తమ ఉద్యోగులను ఆదేశించింది. ఎన్‌సిటిఇ ఉద్యోగుల్లో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఎన్‌సిటిఇ ఈ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా బిఇడి, ఇతర టీచింగ్ శిక్షణా సంస్థలకు ఎన్‌సిటిఇ గుర్తింపు మంజూరు చేస్తుంది. గుర్తింపులు మంజూరు చేసే విషయంలో ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని ఎంపిక చేసిన కాలేజిలనుంచి వచ్చే గుర్తింపు దరఖాస్తులను మాత్రమే ఎన్‌సిటిఇ పరిశీలిస్తోందనే ఆరోపణలున్నాయి. ఎన్‌సిటిఇలో ఎలాంటి అవినీతి చర్యలకు ఆస్కారం లేకుండా చూడడానికి గత మూడేళ్లలో తమ ఆస్తులు, వాహనాల వివరాలను అందజేయాలని ఉద్యోగులందరినీ ఆదేశించడం జరిగిందని ఎన్‌సిటిఇ ఉన్నతాధికారి చెప్పారు. ఉద్యోగులనుంచి వివరాలు కోరడం గతంలో కూడా ఉందని, అయితే ఇప్పుడు తప్పనిసరి చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌సిటిఇ అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలను పరిశీలించడంకోసం ఒక విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2015లో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలియజేశారు.