జాతీయ వార్తలు

విప్ జారీచేసే పార్టీలపై చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: రాష్టప్రతి ఎన్నికల్లో ఒక అభ్యర్థికి ఓటు వేయాలని తమ సభ్యులకు ఆదేశాలు జారీ చేసే రాజకీయ పార్టీలు చట్టపరంగా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఎన్నికల కమిషన్ గురువారం స్పష్టం చేసింది. అయితే పార్టీలు ఏ అభ్యర్థి తరఫునైనా ప్రచారం చేయవచ్చని, ఓటర్లను ఓటు వేయమని లేదా ఓటు వేయకుండా ఉండమని కోరవచ్చని ఇసి స్పష్టం చేసింది. రాష్టప్రతి ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండడం, పార్టీలు ఎలాంటి విప్ జారీ చేసే వీలు లేనందున ఓటు వేయాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఓటర్లకు ఉంటుంది. ఏదయినా ఒక రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఫిరాయింపు కింద అనర్హతను ఎదుర్కోవలసి ఉంటుందా లేక ఏదయినా ఒక అభ్యర్థికి ఓటు వేయమని కోరితే ఆ పార్టీపైన ఏదయినా చర్య ఉంటుందా అని అంటూ చాలామంది సభ్యులు ఇసిని ఆశ్రయించడంతో ఇసి ఈ వివరణ ఇచ్చింది. ఓటింగ్‌కు సంబంధించి విప్ జారీ చేసే లేదా ఆదేశాలు జారీ చేసే పార్టీలు భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 171సి సెక్షన్ కింద చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా ఇసి స్పష్టం చేసింది.