జాతీయ వార్తలు

గవర్నర్ పదవి ఆర్‌టిఐకు అతీతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి గవర్నర్ పదవి వంటి రాజ్యాంగ వ్యవస్థలను ఎందుకు తీసుకురాకూదని సుప్రీం కోర్టు గురువారం ప్రశ్నించింది. 2007లో గోవా రాజకీయ పరిస్థితికి సంబందించి అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ రాష్టప్రతికి అందించిన నివేదికను బహిర్గం చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాన్ని సవాల్ చేస్తూ 2011లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ప్రశ్నను లేవనెత్తింది. న్యాయమూర్తులు అమిత్ మిశ్రా, అమితావరాయ్‌లతో కూడిన ధర్మాసనం గవర్నర్ విధుల నిర్వహణకు సంబంధించి దేన్నీ దాచడానికి వీల్లేదు అలాంటప్పుడు ఈపదవిని ఆర్‌టిఐ పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు? అని కేంద్రాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ మాట్లాడుతూ ఇదే తరహా పిటిషన్ మరొకటి సుప్రీం పరిశీలనలో ఉందని తాజా అప్పీలునుకూడా దీంతో కలిపి విచారించాలని సూచించారు. అలాగే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆస్తులను వెల్లడించాలన్న పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారని దాన్ని కూడా ప్రస్తుత పిటిషన్‌తో కలిపి విచారించాలని అన్నారు. దానికి స్పందించిన సుప్రీం బెంచ్ ‘తన ఆస్తులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి కూడా దేన్నీ దాచడానికి వీల్లేదు’ అని పేర్కొంది. ఇతర పిటిషన్లను కూడా ప్రస్తుత పిటిషన్‌తో కలిపి విచారించాలంటే దాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని బెంచ్ తెలిపింది. కాగా గవర్నర్ నివేదికను రహస్యంగా ఉంచడానికి వీల్లేదని దీన్ని కూడా ఆర్‌టిఐ చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిందేనని సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ అన్నారు. బాంబే హైకోర్టు పనాజీ బెంచ్ ఆదేశించినట్టుగా ఆ నాటి గవర్నర్ నివేదికను బహిర్గం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది.