జాతీయ వార్తలు

టైట్లర్ నుంచి ప్రాణహాని ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కోర్టుకు హాజరై తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడుల్లో టైట్లర్ నిందితుడిగా ఉన్నారు. టైట్లర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఇరవై నాలుగు గంటలూ ఇద్దరు గార్డులతో భద్రత కల్పించాలని కోర్టును అభ్యర్థించారు. 1984లో ఢిల్లీలోని పుల్‌బంగాష్ ప్రాంతంలో సిక్కులపై జరిగిన దాడికి కాంగ్రెస్ నేత టైట్లర్ నాయకత్వం వహించారన్న ఆరోపణలున్నాయి. ఆ దాడుల్లో ముగ్గురు సిక్కులు మృతిచెందారు. కాగా ఈ కేసులో సిబిఐ టైట్లర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. అయతే 2015 డిసెంబర్ 4న అభిషేక్ వర్మ ఫిర్యాదుతో మళ్లీ కేసును తిరగదోడారు.