జాతీయ వార్తలు

ఇప్పటికిప్పుడే ఆగిపోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: రోజు రోజుకూ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను నిరోధించడం అన్నది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదని, ఇందుకు పసల్‌బీమా వంటి దీర్ఘకాలిక సంక్షేమ పథకాలు చేపట్టడం ఒకటే మార్గమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రైతు ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహార్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ‘ఇప్పటికిప్పుడు రైతు ఆత్మహత్యలు నివారించడానికి మంత్రదండం లేదు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అటార్నీ జనరల్ చెబుతున్న దాన్ని వేచిచూడాలి’ అని బెంచ్ పేర్కొంది. సిటిజన్ రీసోర్స్ అండ్ యాక్షన్ ఇనిషియేటీవ్ అనే స్వచ్ఛంద సంస్థ పిల్ వేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆర్నెల్ల తరువాత పిల్ విచారణ చేపట్టడానికి కోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్‌డిఏ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు చేపట్టిందని వెల్లడించారు. పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయన్న వేణుగోపాల్ ప్రభుత్వానికి కొంత సమయం కావాలని అన్నారు. 12 కోట్ల మంది రైతుల్లో 5.34 కోట్ల మందికి వివిధ సంక్షేమ పథకాలు అందాయని, అందులో ఫసల్ బీమా పథకం ఒకటని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఇప్పటికే 30 శాతం మంది రైతుల పొలాలు పంటల బీమా పథకం పరిధిలోకి వచ్చినట్టు ఆయన కోర్టుకు తెలిపారు. 2018 నాటికి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తొలుత రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తరువాత గడువుకోసం కేంద్రం చేసిన అభ్యర్థనకు అంగీకారం తెలిపింది. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి తీసుకోవల్సిన చర్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించింది. ఎన్‌జివో తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్‌సాల్వెస్ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.