జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఫలిస్తున్న సైనిక వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఉగ్రవాద నిరోధానికి అది చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ ఏడాది జూలై వరకు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పాలుపంచుకొంటున్న భద్రతా దళాలు 82 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. అంటే 2016 సంవత్సరం ఇదే సమయంలో భద్రతా దళాలు మట్టుబెట్టన 76 మంది ఉగ్రవాదులకన్నా 13 మంది ఎక్కువ. అంతేకాదు కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉండిన 2012, 2013 సంవత్సరాల్లో భద్రతా దళాలు అంతమొందించిన మొత్తం ఉగ్రవాదుల సంఖ్యకన్నా కూడా ఇది ఎక్కువ కావడం విశేషం. 2012లో జమ్మూ, కాశ్మీర్‌లో సైన్యం మొత్తం 72 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా 2013లో 63 మంది ఉగ్రవాదులు హతమైనారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014లో 110 మంది ఉగ్రవాదులు హతం కాగా, 2015లో 108 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులు హతమైనారు.
ఈ ఏడాది జూలై 2వ తేదీ వరకు హతమైన ఉగ్రవాదుల సంఖ్య 2014, 2015 సంవత్సరాల్లో ఇదే సమయంలో హతమైన వారికన్నా స్వల్పంగా తక్కువని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. కాశ్మీర్ లోయలో దాగి ఉన్న మిలిటెంట్ల జాడను కనిపెట్టి వారిని పట్టుకోవడానికి, అలాగే ఇంటెలిజన్స్ నివేదికల ఆధారంగా ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఆపరేషన్లను చేపట్టే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందని కూడా ఆ అధికారి చెప్పారు. ఈ ఏడాది జూలై వరకు హతమైన 92 మంది ఉగ్రవాదుల్లో చాలామంది కరుడుగట్టిన, కాశ్మీర్ లోయలో చాలా చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారేనని కూడా ఆ అధికారి చెప్పారు.
కాగా, జమ్మూ, కాశ్మీర్‌లో చొరబాట్లు సైతం తగ్గుముఖం పట్టినట్లు ఆ అధికారి చెప్పారు. 2016లో 371 చొరబాటు సంఘటనలు జరగ్గా, ఈ ఏడాది మే చివరి నాటికి ఈ సంఖ్య 124కు తగ్గినట్లు ఆయన చెప్పారు. 2016 జూలై 2 వరకు 126 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరగ్గా, ఈ ఏడాది కనీసం 168 సంఘటనలు జరిగాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే రాళ్లు రువ్విన సంఘటనలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు కేవలం 142 సంఘటనలు మాత్రమే జరిగాయి. గత ఏడాది ఒక్క జూలై నెలలోనే 820కి పైగా ఇలాంటి సంఘటనలు జరిగాయి. జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు బుర్హాన్ వనీ భద్రతా దళాల చేతిలో హతమైన తర్వాత పెద్దఎత్తున హింసాకాండ చెలరేగడమే దీనికి కారణం.

ఉగ్రవాదుల కదలికలున్నచోట కూంబింగ్ నిర్వహిస్తున్న సైన్యం (ఫైల్ ఫొటో)