జాతీయ వార్తలు

మోదీ-జిన్‌పింగ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 7: ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం జర్మనీ ఓడరేవు పట్టణం హాంబర్గ్‌లో జి- 20 సమావేశాల సందర్భంగా పరస్పరం పలకరించుకోవటంతోపాటు ఆ తరువాత పలు అంశాలపై ముఖాముఖి చర్చలు జరపటంతో గత మూడు వారాలుగా సిక్కిం సెక్టార్‌లో రెండుదేశాల సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు తెర పడే అవకాశాలు కొంత మెరుగయ్యాయి. మోదీ, జిన్‌పింగ్‌లు పలు అంశాలపై చర్చలు జరిపినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే హాంబర్గ్‌లో ప్రకటించారు. సిక్కిం సెక్టార్‌లో రెండు దేశాల సైన్యాలకు మధ్య ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇరువురు నాయకులు జరిపిన చర్చలకు అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఇరువురు నాయకులు సిక్కిం సెక్టార్ ఉద్రిక్తత గురించి చర్చించారా? లేదా అనేది వెల్లడి కాలేదు. మోదీ, జిన్‌పింగ్ ఏయే అంశాలపై చర్చలు జరిపారనేది వెల్లడించేందుకు గోపాల్ బాగ్లే నిరాకరించారు. ఇరువురు నాయకులు పలు అంశాలపై చర్చలు జరిపారని, అయితే ఈ చర్చల వివరాలు వెల్లడించటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేయటం గమనార్హం.
హాంబర్గ్‌లో జి- 20 సమావేశాల నేపథ్యంలో బ్రిక్స్ అధినాయకుల సమావేశం సందర్భంగా నరేంద్ర మోదీ, జీ జిన్‌పింగ్‌లు కలుసుకుని చర్చలు జరపటం గమనార్హం. జి- 20 సమావేశాల నేపథ్యంలో మోదీతో జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం లేదని చైనా అధికార ప్రతినిధి గురువారం ప్రకటించటం తెలిసిందే. మోదీని జిన్‌పింగ్ కలుసుకోరని చైనా చెప్పిన వెంటనే ముఖాముఖి చర్చలకు తాము కూడా అడగలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించటం తెలిసిందే. ఈ రెండు ప్రకటనలు రావటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం అవుతుందని భావించిన నేపథ్యంలో 24 గంటలు గడవకముందే శుక్రవారం మోదీ, జిన్‌పింగ్‌లు పలు అంశాలపై చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
పరస్పరం ప్రశంసలు
జి- 20 సమావేశం ప్రారంభ ప్రసంగాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు పరస్పర దేశాలను ప్రశంసించుకోవటం గమనార్హం. మొదట నరేంద్ర మోదీ జి- 20 సమావేశానికి చేరుకున్న వెంటనే స్వాగత సమావేశంలో మాట్లాడుతూ చైనాలో తదుపరి జరిగే బ్రిక్స్ సమావేశం గురించి ప్రస్తావిస్తూ, భారత దేశం నుండి పూర్తి సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. చైనాలో ఏర్పాటు చేస్తున్న బ్రిక్స్ సమావేశం విజయవంతం కావాలంటూ జిన్‌పింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఒకవైపు చైనాను ప్రశంసిస్తూనే మరోవైపు చైనా ఆప్తమిత్రుడైన పాకిస్తాన్‌పై పరోక్షంగా చురకలు వేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు బ్రిక్స్ నాయకులు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ పిలుపు ద్వారా మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్‌ను ప్రోత్సహించకూడదని పరోక్షంగా చైనాకు సూచించటం గమనార్హం. జిన్‌పింగ్ కూడా భారత దేశం తీవ్రవాదాన్ని అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. భారత దేశం ఆర్థిక ప్రగతిలో మరింత విజయం సాధించాలనే ఆకాంక్షను చైనా అధ్యక్షుడు వ్యక్తం చేయటం గమనార్హం.