జాతీయ వార్తలు

ఐఐటిల కౌనె్సలింగ్ ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: జెఇఇ (అడ్వాన్స్‌డ్) ప్రవేశ పరీక్షల ద్వారా ఐఐటిల్లో తదుపరి కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జెఇఇ-ఐఐటి (అడ్వాన్స్‌డ్) లపై హైకోర్టుల్లో దాఖలయ్యే ఏ పిటిషన్లనూ పరిగణనలోకి తీసుకోవద్దని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలో ఐఐటిలు, ట్రిపుల్ ఐటిలు, ఎన్‌ఐటిలో ప్రవేశానికి జెఇసి (అడ్వాన్స్‌డ్) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. హిందీ భాష ప్రశ్నపత్రంలో ముద్రణా లోపాలు దొర్లాయన్న కారణంతో జెఇఇ (అడ్వాన్స్‌డ్) పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏడు మార్కులు బోనస్ (అదనంగా) ఇచ్చారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను ఆపివేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సంబంధించి హైకోర్టుల్లో ఎన్ని కేసులు దాఖలయ్యాయో శనివారం నాటికి వివరాలు అందజేయాలని ఆయా కోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో 33 వేల మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. దీనిపై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.