జాతీయ వార్తలు

భారత్-పాక్ సరిహద్దులో భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: జమ్మూ-కాశ్మీరులోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఒక మోస్తరు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 పాయింట్లుగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాలకు భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపన సంభవించిందని భారత వాతావరణ విభాగంలోని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాల్లో జమ్మూ-కాశ్మీరు ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంభవించిన భూకంపం వలన ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగిన దాఖలాలు లేవు.