జాతీయ వార్తలు

లాలూ కుమార్తె ఫామ్‌హౌస్‌ల్లో ఈడి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: బీహార్ మాజీ సిఎం, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయ ఎంపి మీసా భారతికి చెందిన ఢిల్లీలోని మూడు ఫార్మ్‌హౌస్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఘితోర్ని, బిజ్వాసన్, సైనిక్ ఫామ్‌హౌస్‌లలో శనివారం ఉదయం ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా విచారణ నిమిత్తం మీసా భారతి భర్త శైలేష్ కుమార్‌ను ఈడి అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఫామ్‌హౌస్‌లు మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్, మెసర్స్ మీషాయిల్ ప్రింటర్స్ అండ్ పేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నాయి. వీరికి చెందిన మరో రెండు ఫామ్‌హౌస్‌లపై కూడా ఈడి అధికారులు త్వరలో దాడులు నిర్వహించే అవకాశాలున్నాయని ఓ అధికారి తెలిపారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నిర్వహించారన్న కేసుకు సంబంధించి సురేంద్ర కుమార్ జైన్, వీరేంద్ర జైన్ సోదరులపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిపారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నిర్వహించిన ఈ ఇద్దరు సోదరులపై నగదు అక్రమ లావాదేవీల నిరోధక చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. మెసర్స్ మిషాయిల్ ప్రింటర్స్ అండ్ పేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఈ ఇద్దరు నెలకొల్పగా దానికి గతంలో భారతి, ఆమె భర్త డైరెక్టర్లుగా పనిచేశారన్న అభియోగాలున్నాయి. షాలినీ హోల్డింగ్స్ లిమిటెడ్, యాడ్-్ఫన్ కేపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మనిమాలా ఢిల్లీ ప్రొపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, డైమండ్ వినిమయ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల్లో మిషాయిల్ ప్రింటర్స్ అండ్ పేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 1.20లక్షల షేర్లను 2007-08లో వంద రూపాయలకు ఒక్క షేర్ చొప్పున తీసుకువచ్చినట్టు విచారణలో తేలినట్లు ఈడి అధికారి ఒకరు తెలిపారు. మళ్లీ ఇవే షేర్లను కేవలం పది రూపాయలకు ఒక్క షేర్ చొప్పున 1.20 లక్షల షేర్లను భారతి తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ షేర్లన్నీ బదలాయించే వరకు కంపెనీ అడ్రస్ 25, తుగ్లక్ రోడ్ పేరుతో ఉండగా, 2009-10లో బిజ్వాసన్ ప్రాంతానికి కంపెనీ అడ్రస్‌ను మార్చేసినట్లు ఈడి విచారణలో తేలింది.

చిత్రం.. ఇడి సోదాలు చేసిన మీసా భారతికి చెందిన ఫామ్‌హౌస్