జాతీయ వార్తలు

కాశ్మీర్ మళ్లీ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 8: లష్కరే తోయిబా మిలిటెంట్ బుర్హాన్ వనీ తొలి వర్ధంతి నేపథ్యంలో శనివారం లోయలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వనీ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించాలన్న వేర్పాటువాదుల ఆలోచనను భగ్నం చేయడానికి అధికారులు ముందుజాగ్రత్త చర్యగా శనివారం మూడు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్ లోయ అంతటా పోలీసు, పారా మిలటరీ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. వేర్పాటువాదుల బంద్ పిలుపుతోపాటుగా అధికారులు విధించిన కర్ఫ్యూ తరహా ఆంక్షల కారణంగా కాశ్మీర్ లోయలో జన జీవితం స్తంభించిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా వనీ సొంత స్వస్థలమైన పుల్వామా జిల్లాలోని త్రాల్, దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్, కుప్వారా జిల్లాలోని త్రెహ్‌గామ్‌లలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు చెప్పారు. గత ఏడాది ఇదే రోజున మృతిచెందిన వనీకి నివాళి అర్పించడారికి త్రాల్‌కు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వేర్పాటువాద వర్గాలు పిలుపునివ్వడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. లోయలోని మిగతా ప్రాంతాల్లో కూడా జనం కదలికలపై ఆంక్షలను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని ఆ అధికారి చెప్పారు. ఈ పరిస్థితి దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా జమ్మూలోని భగవతినగర్ బేస్‌క్యాంప్‌నుంచి అమర్‌నాథ్ యాత్రను తదుపరి ఉత్తర్వుల దాకా నిలిపివేశారు. అయితే పహల్‌గామ్, బల్తాల్ బేస్‌క్యాంప్‌లనుంచి మాత్రం యాత్ర మామూలుగా కొనసాగుతుంది. శనివారం జరగాల్సిన అన్ని యూనివర్శిటీ పరీక్షలను వాయిదా వేశారు. పాఠశాలలు, షాపులు, వ్యాపార సంస్థలు సైతం మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు సైతం తిరగలేదని ఆ అధికారి చెప్పారు.
వనీకి పాక్ ప్రధాని నివాళి
లష్కరే తోయిబా మిలిటెంట్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం నివాళి అర్పించారు. ఆయన మృతి కాశ్మీర్ లోయలో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటానికి కొత్త స్ఫూర్తినిచ్చిందని ఈ సందర్భంగా ఇచ్చిన సందేశంలో షరీఫ్ పేర్కొన్నారు. స్వయం నిర్ణయాధికారంకోసం కాశ్మీరీలు జరుపుతున్న పోరాటానికి పాకిస్తాన్ రాజకీయ. దౌత్య, నైతిక మద్దతు కొనసాగుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

చిత్రం.. జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతో జాతీయ రహదారిపై నిలిచిపోయన వాహనాలు