జాతీయ వార్తలు

కూతుళ్లే ‘కాడెద్దులు’...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేహోర్, జూలై 9: దుర్భర దారిద్య్రం కారణంగా పొలం దున్నడానికి ఎద్దులను కొనే స్తోమతు లేని ఓ పేద రైతు తన ఇద్దరు కుమార్తెలనే పొలం దునే్నందుకు ఎద్దులుగా వాడుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా సేహోర్‌లోనే హృదయ విదారకమైన ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బస్తన్‌పూర్ పన్‌గారి గ్రామానికి చెందిన 42 ఏళ్ల సర్దార్ బరేలా తన ఇద్దరు కుమార్తెలు 13 ఏళ్ల రాధ, తొమ్మిదేళ్ల కుంతిలను ఎద్దులుగా చేసుకొని పొలం దున్నుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారడంతో జిల్లా అధికారుల్లో చలనం వచ్చి ఒక రెవిన్యూ అధికారిని శనివారం ఆ రైతు వద్దకు హుటాహుటిన పంపించారు. సేహోర్ ముఖ్యమంత్రి జిల్లానే కాక విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విదిశ లోక్‌సభ స్థానంలో భాగం కూడా. అన్నిటికన్నా విచారకరమైన విషయమేమిటంటే ఆ రైతు గత రెండేళ్లుగా తన కూతుళ్లను పొలం దున్నడానికి ఉపయోగించుకుంటున్నాడు. తన కూతుళ్లను చదివించడానికి గానీ, పొలం దున్నడం కోసం ఎద్దులను కొనడానికి గాని తనకు ఆర్థిక స్తోమతు లేదని, అందుకే వారిని చదువు మాన్పించి పొలం పనులకోసం వాడుకోక తనకు వేరే దారి లేకపోయిందని ఆ రైతు పిటిఐ ప్రతినిధి వద్ద వాపోయాడు. కాగా, ఈ సంఘటన తమ దృష్టికి రాగానే అధికారులను ఆ గ్రామానికి పంపించామని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు బరేలాకు లభించేలా చూస్తామని జిల్లా పిఆర్‌ఓ ఆవిష్ శర్మ చెప్పారు.