జాతీయ వార్తలు

గీత దాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం సభలో విశ్వరూపం ప్రదర్శించారు. సభలో అన్‌పార్లమెంటరీ అలాగే క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని ఆమె తీవ్ర హెచ్చరిక చేశారు. సభ నియమ, నిబంధనలు ఉల్లంఘన, దూషణకు దిగడంపై సభ్యులకు ఆమె క్లాసు తీసుకున్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో బిజెపి సభ్యుడు సంజయ్ జైస్వాల్ భారతీయ వైద్య మండలిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ మండిపడుతూ ఈ హెచ్చరిక చేశారు. తొలుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సభ్యుడి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించకపోతే మంగళవారం పత్రికల్లో వస్తుందని స్పష్టం చేశారు. వెంటనే స్పీకర్ మహాజన్ సభ్యులు సభాగౌరవాన్ని కాపాడాలని, అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేయడం సరైందికాదని హెచ్చరించారు. ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా స్వీయ నిగ్రహం పాటించాలని సూచించారు. వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి బిజెపి సభ్యుడు సంజయ్ జైస్వాల్ ఎంసిఐను ఉద్దేశించి సభలో చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.