జాతీయ వార్తలు

విపక్షాలకు నితీష్ మరో ఝలక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జత కడుతున్న ప్రతిపక్ష పార్టీలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో షాక్ ఇచ్చారు. మొత్తం పదిహేడు పార్టీలు తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు మంగళవారం ఢిల్లీలో సమావేశం అవుతున్న తరుణంలో ఆ భేటీకి తాను హాజరు కావడం లేదంటూ నితీష్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పాట్నాలోనే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన ఓ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకోవడంతో మొత్తం జాతీయ ప్రతిపక్ష పార్టీల భేటీ అనూహ్య మలుపు తిరిగినట్లయింది. నిజానికి ఢిల్లీలో విపక్షాల సదస్సు ఆలోచనకు శ్రీకారం చుట్టింది నితీష్‌కుమారే కావడం, ఇప్పుడు ఆయనే దీనికి వచ్చే అవకాశం లేకపోవడంతో మొత్తం పరిస్థితి తలకిందులైనట్లయింది. ఆర్‌జెడి అధినేత లాలూతో కలిసి ఏప్రిల్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకున్న నితీష్ బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు తన వ్యూహాన్ని ఆమెకు వివరించారు. అప్పట్లోనే రాష్టప్రతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న చర్చ కూడా జరిగింది. 2019లో జరిగే జాతీయ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవాలంటే విపక్షాలను ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని సోనియాకు ఆయన స్పష్టం చేశారు. అయితే గత నెలలోనే విపక్షాల ఐక్యతకు గండికొట్టారు. బిజెపి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. ఉపరాష్టప్రతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న తరుణంలో ఢిల్లీ భేటీకి నితీష్ కుమార్ హాజరయ్యే అవకాశం లేకపోవడం దీని ఐక్యతను సందిగ్ధంలో పడేసింది. మొదటిసారి నితీష్ నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా రెండోసారి కూడా ఆయన అనుసరిస్తున్న ఇదే వైఖరిని విపక్షాలు భరించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే తాను స్వయంగా హాజరుకాకపోయినా తన తరపున ఢిల్లీ సమావేశానికి జెడియు సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌ను నితీష్ పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాష్టప్రతి అభ్యర్థిత్వం విషయంలో విపక్షాలకు మొండిచేయి చూపించిన నితీష్ ఉపరాష్టప్రతి ఎన్నికల విషయంలో విపక్షాల అభ్యర్థినే బలపరిచే అవకాశముందని చెబుతున్నారు. ఇంతకీ నితీష్ అడ్డం తిరగడానికి కారణమేమిటన్నది ఆసక్తి కలిగిస్తోంది. లాలూ ఇంటిపై జరిగిన సిబిఐ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడం, స్థానిక పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలవడం నితీష్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించిందని చెబుతున్నారు. సిబిఐ దాడుల విషయంలో నోరు మెదపని నితీష్ పార్టీకి చెందిన ఎవరూ కూడా మాట్లాడకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది.